శిరీష్  చేతుల మీదుగా “అపరిచిత దారి” ఫస్ట్ లుక్!

IMG 20250225 WA0257 scaled e1740493423956

పరం జ్యోతి ఫిలిమ్స్ యు అండ్ మీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై జే. డి.ఎల్ క్రియేషన్స్ ప్రజెంట్స్ లో తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో రవి బాసర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం అపరిచిత దారి. డిఫరెంట్ కథ, కథనాలతో దర్శకుడు రవి బాసర ఈ సినిమను తెరకెక్కించారు.

నిర్మాతలు పేపర్ సత్యనారాయణ, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్ రాజీ పడకుండా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ తెలుగు తో పాటు కన్నడ లో ఒకసారి విడుదల కానుంది. రహదారులలో లో రాత్రులు జరిగే ప్రమాదాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

హర్రర్ కామిడి జానర్ లో రాబోతున్న అపరిచిత దారి చిత్రం బెంగళూరు , హైదరాబాద్ లో షూట్ చేశారు. త్వరలో ఈ మూవీ టీజర్ విడుదల కానున్నాయి. బాలా గణేశన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్.వి సంగీతం అందిస్తున్నారు.

IMG 20250225 WA0265

అపరిచిత దారి చిత్ర ఫస్ట్ లుక్ ను సక్సెస్ ఫుల్ ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి గారు విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్ అందరికి మంచి పేరు రావాలని, ఇలాంటి వైవిధ్యభరితమైన కథాంశంతో వస్తోన్న సినిమాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయని , చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలిపారు.

నటీనటులు:

తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్, పద్మనాభ రెడ్డి, హేమంత్, సిరి, రజత్, కీర్తి, మను, ఉమేష్, సింహాద్రి, శుభ రక్ష, స్వామి తదితరులు… నిర్మాతలు: పేపర్ సత్యనారాయణ, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్, లైన్ ప్రొడ్యూసర్స్: ఆనంద్, పద్మనాభ రెడ్డి, దర్శకత్వం: రవి బాసర, సంగీతం: ఎస్.ఎస్.వి, కథ: బాసర లక్కి పూరి, కెమెరామెన్: బాల గణేషన్, ఎడిటర్: ఆలోషియోస్ ,ఆర్ట్: రవీందర్ సిరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *