2023 నా సినీ కెరియర్ లో మరిచిపోలేని సంవత్సరం, ఒకే సంవత్సరంలో నమస్తే సేట్ జీ, దక్ష, మిస్టరీ ఇలా మూడు సినిమాలు విడుదల చేసి ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాను అంటున్న సాయి కృష్ణ తో మా 18F మూవీస్ టీమ్ జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ లోనీ కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ప్రచురిస్తున్నాము..
కిరాణా షాపు వ్యక్తుల జీవన శైలి గురించి నమస్తే సేట్ జీ సినిమా లో , సీనియర్ నటుడు శరత్ బాబు గారి అబ్బాయి ఆయుష్ ని దక్ష సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసాం, అలానే మిస్టరీ సినిమా ద్వారా వెంకట్ పులగం గారు ,వెంకట్ దుగ్గిరెడ్డి లు నిర్మాత లు గా, సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, ఆలీ, సుమన్ లు, హీరోయిన్ గా స్వప్న చౌదరి లు ముఖ్య పాత్రలో చేసిన ఈ సినిమా అక్టోబరు లో విడుదల చేసాం.
ఇలా మూడు సినిమాలు 2023 లో విడుదల చేసాం, భవిష్యత్ లో ఇంకా మరెన్నో సినిమా లు తీసి నాకంటూ ప్రత్యేక స్థానాన్ని పరిశ్రమలో ఏర్పాటు చేసుకుంటాను అలానే ఈ మూడు సినిమాలు త్వరలో ఓటిటి లో కూడా విడుదల చేస్తాం.
నాకు తోడుగా నిలిచిన నా గురువు లు తుమ్మలపల్లి రామసత్యనారాయణ కి, మహేంద్రనాధ్ గారు, నా టీం కి, మీడియా మిత్రులకి, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా స్పెషల్ ఇంటర్వ్యూ కి కుల్ స్టాప్ పెట్టారు తల్లాడ సాయికృష్ణ
ఓకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ సాయి కృష్ణ..
*కృష్ణ ప్రగడ.