తెలుగు లో పాపులర్ ఓటీటీ మాధ్యమం అయిన ఆహా, రియాలిటీ షోస్ లో తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ ఓటీటీ మద్యమం లో పోటీ తట్టుకోవాలి అంటే నాన్ ఫిక్షన్ ఒక్కటే సరిపోదు, ఫిక్షన్ లో కూడా తమ ఆదిపత్యం ఉండాలని తలచి ఒరిజినల్ ఫిక్షన్ సిరీస్ల వేటలో పడింది.
ఆహా మొదలు పెట్టిన ఫిక్షన్ కధల ప్రయాణం లో ఎన్నో వడపోతల తర్వాత పాపులర్ సింగర్ మరియు హోస్ట్ అయిన శ్రీ రామ చంద్ర లీడ్ పాత్ర లో ‘పాపం పసివాడు’అనే కామెడీ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించుంది.
ఈ పాపం పసివాడు ఒరిజినల్‌ను వీకెండ్ షో రూపొందించింది. ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తే ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ యొక్క ట్రైలర్‌ను కలర్ ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ రిలీజ్ చేశారు. ఐదు ఎపిసోడ్స్ గా ఉన్న ఈ సీజన్ 1 సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ ‘పాపం పసివాడు’ సిరీస్‌లో సింగర్ సింగర్ శ్రీరామ చంద్రతో పాటు గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. మన కథానాయకుడు శ్రీరామ చంద్ర పాతికేళ్ల క్రాంతి అనే కుర్రాడి పాత్రలో అలరించబోతున్నారు. అతను నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాడు. అతని హృదయం ప్రేమ కారణంగా బద్దలై ఉంటుంది. అలాంటి తరుణంలో అతన్ని ఒకరు ఇద్దరు కాదు… ఏకంగా ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తారు.
డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ, ఆహా వారి ఒరిజినల్ సిరీస్ ‘‘పాపం పసివాడు ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ కావటం ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రేమ, కామెడీ కాంబోలో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ రోలర్ కోస్టర్‌లా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సిరీస్ ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఆహా ఎంటైర్ టీమ్‌కి అభినందనలు”, అన్నారు.
శ్రీరామ చంద్ర, ప్లే బ్యాక్ సింగర్‌గారియాలిటీ షోస్ హోస్ట్ గా తన వైవిధ్యాన్ని ఎప్పుడో చాటుకున్నారు. ఇప్పుడు శ్రీ రామ్ కథానాయకుడి గా ఆహాలో రూపొందిన ‘పాపం పసివాడు’సిరీస్ ద్వారా యాక్టింగ్ కెరియర్ కూడా స్టార్ట్ చేసినట్టు అయ్యింది.
శ్రీరామ్ చంద్ర తన యాక్టింగ్ గురించి మాట్లాడుతూ ‘‘ఆహాతో నేను కలిసి పని చేయటం ఇది మూడోసారి. యాంకర్‌గా ఇక్కడ నా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు పాపం పసివాడు సిరీస్‌తో యాక్టర్‌గా మారాను. ఇది ఓ వైపు ప్రేమ మరో వైపు కామెడీ కలయికతో సాగే ఒరిజినల్. చాలా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేశాను. సెప్టెంబర్ 29న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు”, అన్నారు
సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో ‘పాపం పసివాడు’ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైలర్, గ్లింప్స్ చూస్తుంటే ఈ పాపం పసివాడు సిరీస్ అందమైన ప్రేమ కథతో పాటు ఆకట్టుకునే భావోద్వేగాలు, ఎంటైర్‌టైన్‌మెంట్ ఇందులో మిళితమై ఉన్నాయి అనిపిస్తుంది.

ఈ పాపం పసివాడు సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చే వరకూ ట్రైలర్ చూస్తూ క్రాంతి ని లవ్ చేయండి. త్వరలోనే మా 18F మూవీస్ రివ్యూ టీం ఇచ్చే రివ్యూ తో మీ ముందుకు వస్తాము.