దీప ఆర్ట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల కానున్న “ఏజెంట్ గై 001” 

InShot 20250129 191105436 e1738158239132

డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మాతగా బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్ స్క్రీన్ ప్లే వహిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఏజెంట్ గై 001. ఈ చిత్రానికి ఆంటోన్ క్లౌడ్ జంపర్ గెస్టిన్ సంగీతాన్ని అందించగా డెన్నిస్ ఆండర్సన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. ఆంటోన్ కార్ల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలో నటిస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో పి శ్రీనివాస గౌడ్ నిర్మిస్తూ సహాయ నిర్మాతగా పి హేమంత్ వ్యవహరిస్తూన్నారు .

IMG 20250129 WA0202

దీప ఆర్ట్స్ బ్యానర్ ద్వారా జనవరి 31వ తేదీన ఎంతో ఘనంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో వస్తున్న మరొక అద్భుతమైన యాక్షన్ అండ్ అడ్వెంచర్లు కలిగిన చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది.

టీజర్ ను చూస్తే డబ్బు చుట్టూ తిరిగే ఒక పొలిటికల్ డ్రామాలా కనిపిస్తుంది. మేయర్ సీటు కోసం జరిగే ఫైట్స్ అలాగే కొన్ని అడ్వెంచర్లు ఉన్నట్లు తెలుస్తుంది. చిత్రం ఎంత నాణ్యంగా ఉండబోతుంది అనేది టీజర్ లోని నిర్మాణం విలువలు ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి.

నటీనటులు :

బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా

సాంకేతిక బృందం :

దర్శకత్వం : డేవిడ్ ఆండర్సన్, నిర్మాత : ఎరిక్ ఆండర్సన్, స్క్రీన్ ప్లే : బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్, డిఓపి : ఆంటోన్ కార్ల్సన్, సంగీతం : ఆంటోన్ క్లౌడ్ జంపర్ గెస్టిన్, ప్రొడక్షన్ డిజైన్ : డెన్నిస్ ఆండర్సన్ తెలుగు, నిర్మాత : పి శ్రీనివాస గౌడ్, సహ నిర్మాత : పి హేమంత్, పిఆర్ఓ : మధు విఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *