Aadikeshava Movie Review & Rating: వైష్ణవ్ తేజ్ ఆదికేశవ గా ఆడియన్స్ ని ఆకట్టుకొన్నాడా ?

InShot 20231124 105837080 e1700803872119

మూవీ : ఆదికేశవ (Aadikeshava ):

రిలీజ్ డేట్: 2023-11-24

నటీనటులు: వైష్ణవ్ తేజ్ పంజా, శ్రీలీల, రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, సుధ, జేపీ, ఆనంద్. అపర్ణ దాస్, తదితరులు

రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి

నిర్మాతలు: సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ

మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్

సినిమాటోగ్రఫి: డూడ్లే, ప్రసాద్ మూరేళ్ల

ఎడిటర్: నవీన్ నూలి

ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్

IMG 20231124 081039

 

ఆదికేశవ రివ్యూ (Aadikeshava Review)

మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సక్సెస్ తర్వాత నటించిన  రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకలను మెప్పించలేకపోయాయి. ఇప్పుడు మారో కొత్త దర్శకుదు చెప్పిన కథ ను నమ్మి కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న మాస్ సిన్మా ఆదికేశవ గా ఈ రొజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ ఆదికేశవ చిత్రం దర్శక మాంత్రికుడు త్రివిక్రమ్  మరియూ సిత్రారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణం లో వైష్ణవ్ తేజ్ శ్రీలీల హీరో హీరోయిన్స్ గా వచ్చిందీ. ఈ ఆదికేశవ చిత్రం  తెలుగు సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు ఆకట్టుకుంది మా 18F మూవీస్ టీమ్ సమీక్ష చదివి తెలుసుకుందామా..!

కధ పరిశీలిస్తే (Story Line): 

బాలు అలియాస్ బాలకోటయ్య (వైష్ణవ్ తేజ్). బాధ్యత లేకుండా తిరుగుతూ సమాజం లో  చిన్న పిల్లలకు ముఖ్యంగా ఆడ పిల్లలకు ఏ చిన్న ఆపద వచ్చినా రుద్రుడై కాపాడుతూ వుంటాడు, కానీ ఇంట్లో తల్లి  ( రాధిక) అతి ప్రేమతో తండ్రీ ( జయ ప్రకాష్ )  మాటలు వినదు. కాని ఇంట్లో అందరూ తండ్రికి భయపడుతూ ఉంటారు.

ఒకానొక టైమ్ లో తండ్రి  మాట కాదనలేక  (జేపీ) ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తాడు. బాలు చురుకుదనం, టాలెంట్ చూసి కంపెనీ యజమాని చిత్రావతి (శ్రీలీల) ఉద్యోగం ఇస్తుంది. అయితే తొలి చూపులోనే ప్రేమ లో పడిన బాలూ ఇష్టాన్ని, మంచి  తనాన్ని  గ్రహించి చిత్రావతి ఒకే చెబుతుంది.

కానీ చిత్రావతి తండ్రి వారి ప్రేమను  అంగీకరించడు.  ఆ క్రమంలో తన తల్లిదండ్రులు (రాధిక శరత్ కుమార్, జేపీ) నిజమైన పేరెంట్స్ కాదని తెలుస్తుంది. ఈ క్రమంలో లో ..

అసలు బాల కోటయ్య ఎవరు ? తన గత జీవితం ఏమిటి?

బాలుకి  అసలు తల్లి దండ్రులు ఎవరు?

అసలు  రుద్ర కాళేళ్వర రెడ్డి  ఎవరూ?

మహా కాలేశ్వర రెడ్డి ఎవరు?

రుద్రా తండ్రికి శత్రువుగా ఉండే చెంగారెడ్డి (జోజు జార్జ్)కు ఎలాంటి గుణపాఠం చెప్పాడు?

రుద్రా తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి  రుద్ర కాళేశ్వరరెడ్డి ఏం చేశాడు?

అనే ప్రశ్నలకు సమాధానమే ఆదికేశవ సినిమా కథ.

కధనం పరిశీలిస్తే (Screen – Play):

IMG 20231123 WA0162 1

ఈ సినిమాలో ప్రధాన బలహీనత అసలు కథనమే (స్క్రీన్ – ప్లే) బాగా లేకపోవడం అని చెప్పాలి. మాస్ మూమెంట్స్ బాగున్నప్పటికీ వాటికి అనుగుణంగా కనిపించే కథా కథనాలు నీరస పరుస్తాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన అదే రెగ్యులర్ మసాలా ఫార్మెట్ నే ఈ సినిమాలో కూడా ఉంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా కమర్షియల్  సినిమాలు వాటి సీన్స్,ఈ సినిమా చూస్తున్నంతసేపు గుర్తొస్తాయి. ఇక ఈ సినిమా కధలో వాడిన కొన్ని ట్విస్ట్ లు కూడా ఏమాత్రం మెప్పించవు. ఇంకా చెప్పాలి అంటే ఓల్డ్ ప్యాక్సన్ హిట్ సినిమాల స్నూప్ లా ఉన్నది.  సినిమా చిన్నదే అయినప్పటికీ కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది.

మలయాళం లో విలక్షణ మైన పాత్రలు చేస్తూ మంచి నటుడు అనిపించుకొన్న జోజు జార్జ్ కి మరింత స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేది. తన పాత్ర లిమిటెడ్ గానే ఉంది ఈ సినిమా లో, అలానే చాలా పాత్రలకు ఇంకా పలు సన్నివేశాలను మరికాస్త బెటర్ గా డిజైన్ చేసిఉంటే బెటర్ సినిమా అయ్యేది.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

IMG 20231123 WA0157

దర్శకుడు ఎన్ శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రానికి కధ ను బాగానే రాసుకొన్నా దాన్ని తెరమీద చూపించడం లో ఫెయిల్ అయ్యాడు. ఇలాంటి కధలు టాప్ హీరోల ఇమేజ్ తో వర్క్ అవుట్ అవుతాయి కానీ మీడియం, చిన్న హీరో లకు అస్సలు సూట్ అవ్వవు. కథని ఎలాగో కొత్తది తీసుకోలేదు కనీసం కథనం (స్క్రీన్ – ప్లే) అయినా కాస్త కొత్తగా రాసుకొని తెరకెక్కించాల్సింది. యాక్షన్ ఎపిసోడ్స్ నే సాలిడ్ గా తెరకెక్కించాలి అని దర్శకుడు ఫిక్స్ అయ్యి వాటిని మాత్రం బాగానే  తెరమీద ప్రెసెంట్ చేశాడు.

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సారి ఓ ఫుల్ మాస్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు అని చెప్పాలి. ఓ మాస్ హీరోగా కూడా తాను బాగానే ఫిట్ అయ్యి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్షన్ లో అయితే తాను ఆకట్టుకుంటాడు. కానీ ఇలాంటి కధలు చిన్న, మీడియం హీరో లకు సూట్ కావు.

హీరోయిన్ శ్రీలీల కూడా మంచి లుక్స్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్ మధ్య ఉన్న సాంగ్స్ లో వీరిద్దరి ఎనర్జీ కూడా బాగా ఎలివెట్ అయ్యింది. ఇంకా కొన్ని సీన్స్ లో అక్కడక్కడా కామెడీ  రోమ్-కాం డైలాగ్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకొన్నాయి.

మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ గా సెట్ అయ్యారు. మంచి నటన కూడా కనబరిచారు. ఇంకా రాధికా, జయ ప్రకాష్, సుధర్శన, సుమన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

IMG 20231123 WA0164 1

 జివి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో బాగుంది. కధనే కృత్రిమంగా ఉన్నప్పుడు టెక్నికల్ గా ఏమి చేయలేరు.

డూడ్లే, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. పాటలలో మంచి విజువల్స్ ఉన్నాయి. ఫైట్స్ ని బాగా కంపోజ్ చేశారు. యాక్షన్ తో పాటు కెమెరా యాంగిల్స్ కూడా డెఫెరెంట్ గా ఉన్నాయి.

నవీన్ నూలి ఎడిటింగ్ బాగానే ఉంది. సినిమా లెన్త్  విశయంలో  కరెక్ట్ ప్లానింగ్ తో వెళ్ళినట్టు ఉంది.

ప్రొడ్యూసర్స్ ఇలాంటి కధను ఈ టైమ్ లో ఎన్నుకోవడమే పెద్ద తప్పు. కరోనా తర్వాత ప్రేక్షకులు దియేటర్స్ కి వస్తున్నారు అంటే, కొత్త కధలు లేదా రియలస్టిక్ గా ఉండే నేటివ్ కధలను లేదా క్రైమ్ థ్రిల్లర్స్ కోసం వస్తున్నారు అవే చూస్తున్నారు.  అప్పుడు ఎప్పుడో వచ్చిన టాప్ హీరోల కమర్షియల్ సినిమాల ఫార్మెట్ లో ఇప్పుడు చిన్న హీరోలతో సినిమాలు చేస్తాను అంటే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి  చూపించడానికి మాత్రమే ఉపయోగపడతాయి.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

IMG 20231123 WA0158

“ఆదికేశవ” చిత్రం పార్ట్శ్ అండ్ పీసెస్ గా చూస్తే, వైష్ణవ్ + శ్రీలీల బాగానే చేశారు అనిపిస్తారు. సాంగ్స్, డాన్స్ లు బాగున్నాయి.  ఆలాగే మంచి మాస్ మూమెంట్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి. కానీ కథ కథనాలు మాత్రం ఎప్పుడో చూసిన పాత సినిమా లనే అనిపిస్తుంది. ఇలాంటి కధలు వైష్ణవ్ ట్రై చేయకపోవడమే బెట్టర్. ప్రస్తుతం వైష్ణవ్ ఎదిగే హీరో కాబట్టి ప్రేక్షకులలో ముద్ర పడాలి అంటే మంచి లవ్ అండ్ ఎమోషనల్ పాత్రలు చేస్తే గుర్తింపు వస్తుంది.

ఆదికేశవ సినిమా మొదటి అంకం (ఫస్టాఫ్) కంటే రెండవ అంకం (సెకండాఫ్) బెటర్ గా  ఉంది. జోజీ జార్జ్ కూడా బాగానే చేశాడు.  ఈ సినిమా ని చాలా తక్కువ ఆంచానాలు పెట్టుకొని వెళ్తే కొంచెం లో కొంచెం బాగానే ఉంటుంది.  ఇక యాక్షన్ ఎలిమెంట్స్ కి వస్తే దర్శకుడు మొదటి నుంచి చెప్తున్నట్టుగా కొత్తరకం వైలెన్స్ నే చూపించాడు. మాస్ లో కాస్త కొత్తరకం యాక్షన్ అంశాలు కోరుకునేవారికి ఆదికేశవలో మాస్ ఎలిమెంట్స్ మరియు ఫైట్స్ మెప్పించవచ్చు.

చివరి మాట: రొటీన్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా!

18F RATING: 2 / 5

* కృష్ణ ప్రగడ.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *