25 చిత్రాల మైలురాయి అందుకున్న  ఇండియన్ సినిమా క్వీన్ లేడీ రౌడీ!

IMG 20251026 WA0030 e1761450605145

 నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం.

  హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రశ్మిక. అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రశ్మిక.

IMG 20251025 WA0240

వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రశ్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, థామా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అయితే బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్యమని చెబుతుంటుంది రశ్మిక మందన్న.

IMG 20251025 WA0188

ఈ అందాలతార తన విజయాలను కొనసాగిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. రశ్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లో రశ్మిక పర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తోంది.

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రశ్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోందనే ప్రెడిక్షన్స్ ట్రైలర్ సక్సెస్ తో ఏర్పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *