మూవీ:ఊరు పేరు భైరవకొన
విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2024,
నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పి. రవిశంకర్ తదితరులు,
దర్శకుడు : వీఐ ఆనంద్,
నిర్మాత: రాజేశ్ దండా,
సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర,
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట,
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్,
ఊరు పేరు భైరవకొన రివ్యూ (Ooru Peru Bhairava Kona Review):
యువ వర్దమాన హీరో సందీప్ కిషన్ గత చిత్రాలు దియేటర్స్ లో అంతగా కలెక్షన్స్ తేలేక డిలా పడటం తో ఈ లేటెస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ అయన ‘ఊరు పేరు భైరవకోన’ తోనైనా ఆ లోటు పూడ్చి మంచి విజయం సాదించాలి అని సందీప్ మిత్ర బృందం గట్టిగా కోరుకున్నారు. అలానే ఈ సినిమా ఫస్ట్ లుక్ టిజర్, ట్రైలర్ బాగుండటం తో భైరవకొన సినిమా మీద భారీ ఆంచానాలు పెరిగాయి. ఎంతగా అంటే రిలీజ్ కి రెండు రోజుల ముందే అధిక డిమాండ్ తో ఎక్కువ గా ప్రీమియర్స్ వేసేలా !
ఈ ఊరు పేరు భైరవకొన సిన్మా కి VI ఆనంద్ దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు.అల్ మోస్ట్ సోలో రిలీజ్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
బసవ లింగం (సందీప్ కిషన్) తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి ఓ పెద్ద దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకుంటూ దొంగతనం చేసిన నగల బ్యాగ్ తో పారిపోతూ అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వచ్చి ఇరుక్కున్నారు. ఐతే, ఈ ఇద్దరితో పాటు హై వే దొంగతనాలు చేసే అగ్రహారం గీత ( కావ్య థాపర్) కూడా వారితో పాటు ఊర్లోకి వస్తోంది. అనుకోని పరిణామాల తో కొత్త పాత్రల పరిచయం తో కధ అనేక మలుపులు తిరుగుతూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంది.
ఇంతకీ, ఆ భైరవకోన ఊరు ప్రత్యేకత ఏమిటి ?,
అక్కడ కనిపించే మనుషులు ఎవరు ?,
ఈ మధ్యలో బసవ – జాన్ – గీత ఎలా కలిశారు ?
ఈ ముగ్గురు ఆ భైరవకోనలో ఎలాంటి విచిత్ర పరిస్థితులను ఎదుర్కొన్నారు ?,
‘మొత్తంగా ఈ ముగ్గురి జీవితాలు భైరవకోనలో ఎలాంటి మలుపులు తిరిగాయి ?,
ఈ మొత్తం వ్యవహారంలో వర్ష బొల్లమ్మ పాత్ర ఏమిటి ?,
ఇంతకీ, గరుడ పురాణం లో మిస్ అయిన నాలుగు పేజీలు ఏమిటి ?
గరుడ పురాణని కి – భైరవకోన కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?
బసవ ఎందుకు దొంగతనం చేశాడు ? ఎవరి కోసం చేశాడు ?
అనే ప్రశ్నలకు జవాబులు కావాలి అంటే వెంటనే దియేటర్ కి వెళ్ళి భైరవకొన సిన్మా చూసేయండి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
VI ఆనంద్ ఫాంటసీ వరల్డ్ లో మొదటి కథ గా వచ్చిన ఈ భైరవకొన విషయం లో ఎక్కడో తప్పు జరిగింది అనిపిస్తోంది. కధ ఎంత కల్పన అయినా ఉండొచ్చు, కానీ, కధనం కూడా పూర్తి కల్పన అయితే, ఆ కల్పన ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటే ప్రేక్షకుల ఊహకు అందని డ్రామా తో అబ్బురపరిచే విషయాలు, ఎమోషనల్ డ్రామా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఫాంటసీ వరల్డ్ లోకి వెళ్ళాలి అంటే అది గత సినిమాలలో చూడనిది అయ్యి ఉండాలి.
నమ్మశక్యం కానీ సంఘటనలను కూడా నమ్మేలా చెయ్యాలి అంటే అద్భుత విజువల్స్ తో పాటు పకట్బందీ కధనం (స్క్రీన్ – ప్లే) వ్రాసి మెప్పించాలి. అలాంటి చిత్రం గతం లో VI ఆనంద్ దర్శకత్వం లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా! లో కుదిరింది. కానీ, ఈ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో ఆ మ్యాజిక్ పూర్తిగా మిస్ అయ్యింది అనిపిస్తుంది.
ముఖ్యంగా పురాతన భూత్ – బంగ్లాల లో దెయ్యాలు ఉండడటం, అనుకోకుండా అక్కడికి వచ్చిన హీరో మరియు మిత్ర బృందం వాటినుండి తప్పించుకోవడం, ఇంకా ఆత్మలు,దెయ్యాల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. దీనికి తోడు, ‘భైరవకోన’లోని హారర్ ఎఫెక్ట్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి. ఆత్మలు (దెయ్యాలు) – మనుసు ల మద్య డ్రామా కూడా కొత్తగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
దర్శకుడు VI ఆనంద్ విజువల్ ట్రీట్ ద్వారా మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ పాత్రల మధ్య ఎమోషనల్ డ్రామా బిల్డ్ చేయడం లొ చాలా చోట్ల లాజిక్ తో పాటు సీన్స్ మీద ఇంట్రెస్ట్ కూడా మిస్ కావడం వంటి అంశాల కారణంగా ఈ సినిమా కధనం రొటీన్ ప్లే లా ఉంది.
మొత్తమ్మీద ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా హర్రర్ జోనర్ సినిమా ఇష్ట పడేవారికి కొంత వరకూ, ఇంకా చిన్న పిల్లలకు బాగా నచ్చుతుంది. కానీ ఆన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోవచ్చు.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
VI ఆనంద్ దర్శకుడిగా పరిచయం కాకముందు నుండి అంటే తను చిన్నప్పటినుండి ఫాంటసీ కధలు ఇష్టంగా చదివాను అని ఆ అనుభవాల నుండి నేను కొన్ని కల్పిత కధలు వ్రాసుకొని సినిమాలుగా తీస్తుంటాను అని చాలా సార్లు చెప్పారు. గతం లో తను తీసిన సినిమాలు కూడా ఆత్మ – శరీరం అనే పాయింట్ తోనే ఉంటాయి.
ఇప్పుడు కూడా చనిపోయిన వారి ఆత్మలు ద్వేషంతో, పగ తో రగిలిపోతూ ఎక్కడో ఒక ప్రాంతం లో ఉంటూ తమ ప్రతీకారం తీర్చుకొనే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో వ్రాసుకొన్న ఎమోషనల్ హారర్ రివేంజ్ డ్రామా నే ఈ ఊరు పేరు భైరవకొన సినిమా
VI ఆనంద్ తీసుకొన్ని కధ లొని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం బాగున్నాయి. అలాగే ఈ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది.
సందీప్ కిషన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన బసవ పాత్రని పోషించి మెప్పించే ప్రయత్నం గట్టిగానే చేశాడు. బసవ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్ లో అలానే ఆ పాత్రతో ముడి పడిన భూమి (వర్ష బొల్లమ్మ) పాత్ర ఆమెకు జరిగిన అన్యాయం, దానికి సందీప్ కిషన్ చేసే రిస్క్ ఇలాంటి సీన్స్ లో మంచి నటన కనబరిచాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కధ లొని బసవ పాత్రకు న్యాయం చేశాడు అని చెప్పవచ్చు.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో భూమి పాత్ర కు పూర్తి న్యాయం చేసింది. తన సహజ నటనతో క్లైమాక్స్ సీన్స్ లో వచ్చే ఎమోషనల్ డ్రామా లో కూడా బాగా నటించి ఆకట్టుకుంది.
కావ్య థాపర్ కూడా అగ్రహారం గీత అనే మరో కీలక పాత్రలో బాగానే నటించింది. రెగ్యులర్ గ్లామర్ పాత్రలా కాకుండా రఫ్ గర్ల్ గా, ఒక సీన్ లో లంగా ఓణి కట్టిన అమాయక అమ్మాయి గా బాగానే నటించింది.
వైవా హర్ష బసవ కి స్నేహితుడి పాత్రలో చేసిన నటన బాగుంది. ఇక వెన్నెల కిషోర్, పి. రవిశంకర్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా రిలీజ్ కి ముందే నిజమే చెప్తున్నా పాట 100 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇలాంటి ఫాంటసీ వరల్డ్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ముఖ్యం. కొన్ని సీన్స్ ని BGM నిలబెట్టింది అని చెప్పవచ్చు.
కెమెరామెన్ రాజ్ తోట సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి అంటే నైట్ ఎఫెక్ట్ షాట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, చాలా న్యాచురల్ లొకేషన్స్ లో ఘాట్ చేసినట్టు ఉన్నాయి. సినిమా మొత్తం సెట్స్ లో ఘాట్ చేసినా విజువల్స్ చాలా న్యాచురల్ గా ఆకట్టుకున్నాయి. సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది.
ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. కధనం కొంచెం బోర్ గా ఉండటం వలన ఎడిటింగ్ మీదకే వస్తుంది. కానీ కొన్ని సీన్స్ షార్ప్ ఎడిటింగ్ తో బాగా ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.
ఈ చిత్ర నిర్మాత రాజేశ్ దండా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ సెట్స్ లో ఎక్కువ నైట్ ఎఫెక్ట్ లో ఘాట్ చేశారు. అనిల్ సుంకర గారు కలవడం వలన కూడా క్వాలిటి లో రాజీ పడకుండా, పెద్ద సినిమా లెవెల్ లో ప్రోమోట్ చేశారు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్:
శ్రీ విష్ణు గరుకమంతుడికి ఏదైనా జీవి చనిపోయిన తర్వాత, తన శరీరం నుండి ఆత్మ వేరు పడి చేసే ప్రయాణం గురించి చెప్పినదే గరుడ పురాణం అని చాలా పురాణ గ్రంధాల లో ఉంది అని చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు. నేను మాత్రం గరుడ పురాణం చదవలేదు.
VI ఆనంద్ మాత్రం శ్రీ కృష్ణ దేవరాయల కాలం లో గరుడ పురాణం లొని నాలుగు పేజీల మిస్ అయ్యాయని కల్పిత కథ రాసుకొని ఆ నాలుగు పేజీల మిస్సింగ్ కి ఈ ‘భైరవకోన’ కధ కి లింకు చేస్తూ చేసిన ఫాంటసీ రివెంజ్ సినిమా నే ఈ ఊరు పేరు భైరవకొన.
ఇది పూర్తి సస్పెన్స్ హర్రర్ సినిమా కాబట్టి మా సమీక్ష లో మరి ఎక్కువ డెప్త్ కి వెళ్ళకుండా సినిమా విశ్లేషణ చేయాలి అంటే కొంచెం కష్టమైన పనే.
ఊరు పేరు భైరవకొన సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే.. ఈ సినిమా లో ఎమోషనల్ హారర్ అండ్ రివేంజ్ డ్రామా తో కూడిన కొన్ని ఎమోషనల్ సీన్స్ – మరి కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఐతే, కథనం రెగ్యులర్ ఫార్మెట్ లో సాగడం, కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా హర్రర్ ఫాంటసీ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు, చిన్న పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది.
రెగ్యులర్ సినీ లవర్స్ ఈ ఊరు పేరు భైరవకొన సిన్మా దియేటర్స్ కి వచ్చి చూడకపోయినా ఓటీటి లోను, టివి లోను ఇష్టపడి చూసే సినిమా గా నిలిస్తుంది. దర్శకుడు వ్రాసుకొన్న కధ ఎలిమెంట్స్ కొత్తగా బాగున్నా , రెగ్యులర్ స్క్రీన్ – ప్లే వలన తెరమీద మాత్రం రొటీన్ సినిమా చూసినట్టు గా వుంది.