పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” రీ రిలీజ్ ట్రైలర్ విడుదల !

gabbar singh trailer e1724768011101

పపర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్లో గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్ ప్రేక్షకులను ఊపేశాయి. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు.

గబ్బర్ సింగ్ చిత్రం ఎప్పటికీ పవన్ అభిమానులకు గుర్తుండిపోతుంది, దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఈ సినిమాకు మరో హైలెట్, అలాంటి చిత్రం ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి వస్తోంది. ఈ మూవీ రీ-రిలీజ్ కానుంది.

gabbar singh trailer 1

 

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగానే గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలు ఉండనున్నాయి. సెప్టెంబర్ 2న ఈ మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ ను దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో విడుదల చేసారు.

gabbar singh trailer 2

గబ్బర్ సింగ్ మూవీని సెప్టెంబర్ 2న రీ-రిలీజ్ చేస్తోంది అనుశ్రీ ఫిలిమ్స్. మొత్తంగా ఈ బ్లాక్‍బస్టర్ చిత్రాన్ని ఫ్యాన్స్ మరోసారి చూడవచ్చు. ఈ చిత్రం రీ-రిలీజ్‍కు హంగామా భారీ స్థాయిలో ఉండడం పక్కా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *