ప్రభాస్ నట విశ్వ రూపాన్ని బాహుబలి సినిమా లు ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉపయోగ పడీ, వాటి ద్వారా దర్శక నిర్మాతలు, బయ్యర్స్ అందరూ లాభ పడ్డారు ఒక్క ప్రభాస్ తప్ప.
ప్రభాస్ తన కెరియర్ ని, హెల్త్ ని పణంగా పెట్టి సుమారు ఐదు సంవత్సరాలు కస్ట పడి బాహుబలి రెండు పార్ట్శ్ కంప్లీట్ చేశాడు.

ఈ ఐదు సంవత్సరాలలో ఐదు లేదా ఆరు సినిమాలు బయట చేసి ఉంటే బహు బలి కి వచ్చిన రెమ్యూలెసన్ వచ్చేది. ఆరోగ్యం బాగుండేది, కెరియర్ గ్రాఫ్ బాగానే ఉండేది ఏమో !.
కానీ సమస్య అంతా బాహుబలి తర్వాత నుండి వచ్చింది. బాహుబలి తో వచ్చిన క్రేజీ ని పపులరిటీని కాపాడు కోవాలనే తపనతో ఇంకా ఎంతో కొంత వెనకేసుకోవాలి అనే ఫ్యామిలీ మాటల విని సాహసం చేసి పాన్ ఇండియా అంటూ కొంచెం పెద్ద స్పాన్ ఉన్న కధల ను ఎంచుకొంటూ హై రెమ్యూలెసన్ అడగడం స్టార్ట్ చేశారు.

పాన్ ఇండియా లెవల్ క్రియటర్స్ , ఇన్వెస్టర్స్ రెక్కలు కట్టుకొని హైదరాబాద్ లో ప్రభాస్ ఇంటి అడ్రసు ఎతుక్కొంటూ వచ్చేశారు. వాళ్ళ రాకను చూసి ఇక్కడ ఉన్న టాలీవుడ్ నిర్మాతలు కూడా మేము కూడా ఎందులోనూ తక్కువ కాదు అంటూ ఎంతైనా అడ్వాన్స్ ఇస్తాము డార్లింగ్ డేట్స్ ఇప్పించండి అంటూ బేరాలు స్టార్ట్ చేశారు.
కానీ ప్రభాస్ బహు బలి టైమ్ లోనే తనకు కధలు నచ్చి ఒప్పుకొన్న సినిమాలు కధ ల బడ్జెట్ ని బాహుబలి రేంజ్ లో పెంచి భారీ సినిమా లు గా తయారు చేశారు. ఆ కధ లను తమ నిర్మాణ సంస్థలు అయిన గోపి కృష్ణ మూవీస్ లో రాధే శ్యామ్ ని , UV క్రియేసన్స్ లో సాహో ని స్టార్ట్ చేశారు.

బహు బలి 2 ఇచ్చిన క్రేజ్ తో SAHOO సినిమా కధ కి బడ్జెట్ పెంచి గ్రాండ్ గా చేస్తూ అనుకొన్న టైమ్ కంటే చాలా లేట్ గా కాంప్లెట్ చేశారు, రిలీజ్ డేట్ కూడా మార్చి మార్చి రిలీజ్ చేశారు. పలితం మన అందరికీ తెలిసిందే..

సాహో సినిమా రిసల్ట్ తో కొంచెం ఆలోచించి, రాధే శ్యామ్ సినిమా ని మరలా మరలా రీ ఘాట్ అంటూ మద్యలో కరొన తో కొంచెం బ్రేక్ ఇచ్చి ఏదోలా కాంప్లెట్ అయ్యింది అనిపించారు.

రాధే శ్యామ్ సినిమా కూడా రిలీజ్ డేట్స్ మారుతూ మారుతూ వచ్చింది. ఇలా జరగడానికి ప్రభాస్ బహు బలి తో వచ్చిన క్రేజ్ అంటూ సినీ పండితులు కృష్ణా నగర్ వీధుల్లో చర్చలు జరుపుతున్నారు.
ఎంతో శ్రమతో ఖర్చుకు ఎనకాడకుండా తీసిన రాధే శ్యామ్ పలితం మామూలుగానే వచ్చింది. ఆ స్టోరీ లైన్ కి అంత బడ్జెట్ అవసరమా అంటూ కొంతమంది మాట్లాడుకొన్నారు. ఆ సినిమా లు ఇప్పుడు గతం .

ఇలా జరగడానికి బాహుబలి ఇచ్చిన క్రేజ్ కదా ?. ఆ రెండు సినిమా లు ప్రేక్షకుల ముందుకు వచ్చే లోపే పాన్ ఇండియా నిర్మాతల సూట్ కేసుల తాకిడి ని తట్టుకో లేక వచ్చిన కధ ల లో తన మార్క్ కధ లను ఎంపిక చేసుకోవడం లో తడబడి కాంబినెసం + బడ్జెట్ చూసుకొని కొన్ని సినిమా లు ఒప్పుకోవడం అడ్వాన్స్ లు ఇచ్చుకోవడం జరిగినది.
అలా ఒప్పుకొన్న కొన్ని సినిమాలు పరిస్తితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దామా !

ఆదిపురుష్: అవమానాలకి అవకాశం ఇచ్చిన టిజర్ !.
ఆదిపురుష్ విడుదల తేదీ ఎందుకు మారిపోయిందో తెలుసా?.
ఆదిపురుష్ ప్రభావం ప్రభాస్ నటిస్తున్న మిగతా సినిమాలపై పడబోతుందా ?. ఆదిపురుష్ వాయిదాతో, ప్రభాస్ నటిస్తున్న మిగతా సినిమాలన్నీ దాదాపు వాయిదా పడే పరిస్థితికి వచ్చాయి.

ఆదిపురుష్ సినిమాను జనవరి 12 నుండి జూన్ 16కు వాయిదా వేశారు. ఎందుకు వేయదా వేశారో అందరికీ తెలిసిన విశయమే. ఎందుకంటే విజయ దశమి పర్వ దినాన అయోద్యలో ఆధిపురుష్ టిజర్ విడుదల చేశారు.
ఆ టిజర్ చూసిన ప్రభాస్ డై హార్డ్ ఫాన్స్ మాత్రం సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేశారు. ఆ వివాదం బాగా ముదిరి ఇంకా నెగిటివ్ ప్రచారం వస్తుంది అని దర్శకుడు ఓం రౌతాల vfx వర్క్ బాగా లేదు అని మరో వి ఫ్ క్స్ కాంపీనికి ఇవ్వాటం వలన రిలీజ్ డేట్ మారుస్తున్నాను అని చెప్తున్నారు.

అన్నీ వందల కోట్లు పెట్టి సినిమా చేస్తున్న దర్శకుడికి, నిర్మాణ సంస్థకి ముందే తెలియనిది కాదు. సమస్య అంత బాహుబలి రేంజ్. ఆ రేంజ్ రీచ్ అవ్వాలి అంటే ఇంకా ఏదో కావాలి అంటూ చెక్కడడం మొదలు పెట్టారు. పాపం ప్రభాస్ మాత్రం ఇక్కడ కూడా బహు బలి అయ్యారా ?

సాలార్: సాగతీతల సుడిగుండం లో సాలార్ కధ !.
ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్ ను 2023 సంవత్సరం సెప్టెంబర్ లో మొదటి గా విడుదల చేయాలనుకున్నారు. కానీ సాలార్ మొదలపెట్టినప్పుడు ఆ సినిమా ఒక పార్ట్ మాత్రమే !. రాను రాను ప్రభాస్ మరియు ప్రశాంత నీల్ ల పాపులారిటీ తో రీ ఘాట్ ల పుణ్యమా అని బడ్జెట్ పెరగడం వలన ఇప్పుడు సాలార్ ను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నట్టు సమాచారం.

ఈ విశయం లో అధికారిక ప్రకటన రావలసి ఉంది.
ఆదిపురుష్ జూన్ నెలకు వచ్చింది కాబట్టి, సలార్ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడం బిజినెస్ పరంగా అంత మంచిది కాదు.

సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయాలంటే కనీసం 3 నెలల ముందు నుంచిప్రమోసన్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఆదిపురుష్ థియేటర్లలో ఉన్న టైమ్ లో సలార్ ప్రమోషన్ ను ప్రభాస్ ముందుకు తీసుకెళ్లలేరు.

ఇది ఒక అడ్డంకి. ఇక రెండో అడ్డంకి ఏంటంటే.. ఆదిపురుష్ ప్రచారం కోసం ప్రభాస్ టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. ఆ వెంటనే సలార్ ప్రచారమంటే ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు.
ఇలాంటి లెక్కలు అన్నీ సుసుకొంటే సలార్ కూడా దాదాపు వాయిదాపడినట్టే. అదే కనుక జరిగితే ప్రభాస్ మరో సినిమా ప్రాజెక్టు-k అనుకొన్న టైమ్ కి రాక పోవచ్చు.

ప్రాజెక్టు-k: లోకల్ టాలెంట్ తో గ్లోబల్ మార్కెట్ కి నెచ్చెన ?
మహానటి సినిమా తో క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చు కొన్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు-కె అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

ఈ ప్రాజెక్టు -k కి నిర్మాత తెలుగు లో భారీ చిత్రాల నిర్మాత వైజయంతీ మూవీస్ అధినేత అశ్వని దత్త గారు. ఈ ప్రాజెక్టుk సినిమా కి చాలా బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం.

సీతా రామం సినిమా టైమ్ లో దత్తు గారిని కలిసినతప్పుడు మాటల సందర్బం లో ప్రభాస్ సినిమా ప్రాజెక్టు-k గురించి అడిగితే, ఇప్పటి వరకూ 60 to 70% ఘాట్ కాంప్లెట్ అయ్యింది అని మిగిలిన ఘాట్ కూడా తొందరిలోనే కాంప్లెట్ చేసి 2023 సంవత్సరం సెప్టెంబర్ లో ప్రభాస్ బర్త్ డే రిలీజ్ చేయాలి అనుకొంటున్నాము అని చెప్పారు .

గ్రాపిక్స్ వర్క్ కాంప్లెట్ అవ్వకపోతే 2024 సంక్రాంతి కి పక్క ప్రాజెక్టు – k రిలీజ్ చేస్తాము అని చెప్పారు. ప్రస్తుత ప్రాజెక్టు-k సినిమా కి ముందున్న సినిమాలు రిలీజ్ కి వాయదాలు కోరుకొంటున్నాయి కదా అలాంటప్పుడు ప్రాజెక్టు -k పరిస్తితి ఏంటి అని అందరూ అనుకొంటున్నారు సినీ విమర్శకులు.

స్పిరిట్ : దూరంగా ఉంటే ఆరోగ్యం… టెస్ట్ చెస్ట్ ప్రమాదం.
ఈ ఆధిపురుష్ , సాలార్, ప్రాజెక్టు -k సినిమాలే కాకుండా ప్రభాస్ ఇంకా అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమాను కూడా ఒప్పుకొన్నాడు మన బాహుబలి ప్రభాస్.

స్పిరిట్ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంది. అది ఎప్పుడో ఇప్పుడే చేపప్డం కొంచెం కస్టమ్ గురూ !.

ఇవి కాక క్రితం నెలలో సిక్రెట్ గా ఓపెనింగ్ చేసిన సినిమా రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్ మాత్రమే). ఈ సినిమా కి మారుతి దర్శకత్వం వాహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాద్యతలు తీసుకొన్నట్టు తెలుస్తుంది.

ఇలా ఒక సినిమా కూడా కాంప్లెట్ అవ్వకుండా ఒక దాని తర్వాత ఒకటి గా సుమారు అర డజను సినిమాలు ఒప్పుకోవడానికి అవి డి లే మీద దడి లే అవ్వడానికి కారణం ఏమిటి ?
కృష్ణా నగర్ వీధిలలో సినిమా పండితులు ఎవరిని అడిగినా చెప్పేది ఒకె ఓక కారణం బాహుబలి అంటున్నారు. ఈ స్టోరీ అంత చదివే తప్పటికి మీకు కూడా కారణం ఏంటో తెలుస్తూ ఉంది కదా ?

డార్లింగ్ ప్రబాష్ కి ఈ మెంటల్ మరియు ఫైనాన్షియల్ టెన్స్ సన్స్ నే కాకుండా బాహుబలి తో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మరో ఆర్టికల్ ల చాలా వివరంగా వ్రాస్తాను, మన డార్లింగ్ డై హార్డ్ ఫాన్స్ కోసం.
-కృష్ణ ప్రగడ..