మట్టి కుస్తీ సినిమా సహ-నిర్మాత రవితేజ ఒక్కరోజు కూడా షూటింగీకి సెట్స్ కి వెళ్లకపోవడం మంచి సంప్రధాయమా?.

GUTTA JWALA AND VISHAL e1669874262791

రవితేజకు గత 30 సంవత్సరాలుగా సినిమాలే లోకం.

దర్శకత్వ శాఖ లో పనిచేసినా, చిన్న చిన్న పాత్రలు చేసినా స్టార్ హీరో అయినా సినిమా ప్రపంచం  నుండి గ్యాప్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఓ సినిమా  షూటింగ్ లో ఉండగానే, మరో సినిమా మొదలుపెడతాడు.

అలా చేతిలో మినిమం రెండూ, మూడు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ఇలాంటి హీరో ఒక్క రోజు కూడా షూటింగ్ కు హాజరుకాలేదు అంటూ సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరిగిపోతుంది. దానికి ప్రూఫ్ గా వీడియొ బిట్స్ హాల్ చల్ చేస్తునాయి.

RAVITEJA

ఇంతకీ ఏ సినిమా కి మాస్ మహారజా ఇలా ఒక్క రోజు కూడా షూటింగ్ కి వెళ్ళకుండా డుమ్మా కొట్టాడా అని చూస్తే అసలు విశయం  తెలిసింది.

ఆ సినిమా ఏంటో తెలుసా.. మట్టి కుస్తీ. దానికి రవితేజ ఏమి చేశాడో తెలుసా ? . సహ – నిర్మాత అని మాట. హీరో, నిర్మాత షూటింగ్ కి వెళ్లక పోతే ప్రాబ్లం కానీ సహ-నిర్మాత షూటింగ్ కి ఇస్టం ఉంటే వెళ్ళవచ్చు లేకపోతే మెయిన్ నిర్మాత మీద నమ్మకం తో తన అనూచారులను పంపి పని కానియవచ్చ.

ఇంత చిన్న విశయానికి అంతా పెద్ద పబ్లిసిటీ అవసరమా !. కానీ మట్టి కుస్తీ మెయిన్ నిర్మాత మరియు హీరో విష్ణు విశాల్ కి మాస్ మహారజా రవితేజ మాస్ ఫాలోయింగ్ తో పాటు ఇమేజ్ కూడా మట్టి కుస్తీ సినిమా ప్రమోషన్ కి ఉపయోగ పడుతుంది అని అన్నీ ఇంటర్వ్యూ లలో ఇలా ప్రచారం మొదలు పెట్టాడు.

రవితేజ మట్టి కుస్తీ సినిమా కధ నచ్చి విష్ణు విశాల్ తో కలిసి తమిళ తెలుగు సినిమాలకు సహ – నిర్మాతగా వ్యవహరించాడు. డబ్బులు పెట్టి సినిమా తీస్తున్న ఏ నిర్మాత అయినా లొకేషన్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.

VISHNU VISHAL AND RT

కానీ ఈ మాస్ హీరో మాత్రం తను నిర్మించే సినిమా సెట్స్ పైకి ఒక్క రోజు కూడా వెళ్లలేదంట. ఈ విషయాన్ని మట్టి కుస్తీ హీరో విష్ణు విశాల్ మరియు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చెబుతున్నారు. సినిమా సెట్స్ పై ఉన్నన్ని రోజులూ ఒక్కసారి కూడా రవితేజను చూడలేదంట.

ఈ వార్త కి ఐశ్వర్య లక్ష్మి  ఇంకా కొంచెం మసాలా జోడిస్తూ తన నిర్మాత అయిన రవితేజను తొలిసారి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే చూశాను అంటూ వయ్యారంగా వచ్చి రాణి తెలుగు లో చెప్పింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.

VISHNU VISHAL AISHWARYA

ఏంటి రవితేజ ని పొగుడుతుందా ? తిడుతుందా! అనుకొనే లోపు తానే అందుకొని రవీ సారూ… ఇలా వ్యవహరించడానికి కారణం మట్టి కుస్తీ హీరోగా నటించిన విష్ణు విశాల్ మరో నిర్మాత కాబట్టి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ  బాగా  వ్యవహరించాడు అంది.

ఇంకా విష్ణు విశాల్ పై నమ్మకంతో నిర్మాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు రవితేజ గారూ అంటూ తెలుగులో కంటే ఇంగ్షీషు లో క్లారిటీగా చెప్పింది.

 విష్ణు విశాల్ ని పొగుడుతూ రవితేజా ని తిట్టిందా ?

అసలు విశయం చెప్పి రవితేజ గోప్ప మనస్సు ని పొగిడిందా ? 

ఏంటో సినిమా నటుల పలుకులు  రెండు మూడు అర్దాలు వస్తాయి కదా ?

లేక మా మీడియా నే అలా అర్దం చేసుకుంటుందా ?. 

ఎంతైనా తోచింది సినిమా పబ్లిసిటీ కి ఉపయోగ పడేలా ఆలోచించి చెప్పేవారు సినిమా వారు…. !

 విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి చెప్పింది  మీరు కూడా వింటారా ? 

మాకు అర్దం అయ్యినా అవ్వకపోయినా మా ప్రేక్షక పాఠకులకు అర్దం అయ్యేలా వ్రాయడానికి మా ప్రయత్నం ఎప్పుడు ముందుంటుంది.

మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్  కి ఈ ఆర్టికల్ షేర్ చేయండి, నచ్చక పోతే   కామెంట్స్ రూపం లో మీ స్పందన తెలియజేయండి.

మేము ఏమి కోరుకుంటాము  మీ దగ్గర నుండి…..ఇంత కంటే.   

* కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *