మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. నందమూరి నట సింహం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న సినిమా వీరసింహారెడ్డి.

ఈ రెండూ సినిమాలకు ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఇవే.
వాల్తేరు వీరయ్య,వీరసింహారెడ్డి, ఈ రెండు సినిమాలను నిర్మించే సంస్థ మైత్రి మూవీ మేకర్స్. అలానే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ శృతిహాసన్ కావటం విశేషం.
https://www.youtube.com/watch?v=6TZihgfaz1k
బిజినెస్ విషయంలోను ఈ రెండు సినిమాలను ఓకే సంస్థ దక్కించుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అదే ఈ రెండు సినిమాలకు సంబంధించిన యుఎస్ఏ హక్కులను ప్రముఖ సంస్థ శ్లోక సినిమాస్ దక్కించుకుంది.
అయితే ఇందులో పై చెయ్యి సాధించింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అని చెప్పొచ్చు. ఎలా అంటే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య రూ. 6.5 కోట్లకు దక్కించుకుకోగా, బాలకృష్ణ వీరసింహారెడ్డి రూ. 3.40 కోట్లకు దక్కించుకుంది.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కన్నా రెండంతల బిజినెస్ చేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచాడు. చిరు, బాలయ్య ఇప్పటికే తొమ్మిది సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు.
అయితే అందులో అయిదు సార్లు విజేతగా చిరు నిలిస్తే నాలుగు సార్లు బాలకృష్ణ విజయం అందుకున్నాడు.

మళ్ళీ చాలా గ్యాప్ తరువాత ఇద్దరూ 2023 సంక్రాంతి భరిలో నిలిచారు. మరి ఇందులో ఎవరి సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుందో తెలియాలి అంటే ఇంకా రెండు నెలలు ఆగాల్సిందే మరీ!.

ఇప్పటి వరకూ తొమ్మిది సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపడ్డ ఆ చిత్రాలతో మరో ఆసక్తికరమైన ఆర్టికల్ తో మీ ముందుకు వస్తాను..

చిరంజీవి, బాల కృష్ణ అబిమనుల కోరిక మేరకు ఆసక్తికర విశయాలుతో మరన్న ఆర్టికల్స్ తో మీ ముందుకు వస్తాము.
మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ లో రాయండి.
- శివ మురళి.