పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ గా చూపించినా, అల్లు అర్జున్ తో డి జె వాయించినా… వరుణ్ తేజ్ ని గద్దలకొండ గణేష్ లా చయిపించినా, మరో మెగా తేజ్ ని సేల్ కి పెట్టినా ఆయనే చేయగలాడు అంటారు సినీ ప్రేక్షకులు.
అలాంటి కధలు రాశి లు కొద్ది వ్రాసి వెండితెర రికార్డ్స్ తిరగరాయించగల పవర్ ఫుల్ దర్శకుడు సెట్స్ లో కట్, యాక్షన్ చెప్పే కళ్యాణ మోక్షం ఎప్పుడు అంటూ గత రెండు సంవత్సరాలుగా అందరి సినిమా సెట్స్ కి వెళ్తూ తను మాత్రం డైరెక్టర్ ని అనేది మార్చి పోయి దర్శకత్వం చేయడం మర్చిపోయాడా ? మన డైనమిక్ డైరెక్టర్ ?
అదే నండి ఎవరిగురించి చదువుతున్నారో తెలిసిందా ? ద గ్రేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించే….. సినిమా డైరక్షన్ కి దారెటు అంటూ ఫిల్మ్ నగర్ లొని అన్నీ ఆఫీసు లు తిరుగుతున్నాడట !. ప్రస్తుతం చేతిలో సినిమా ఉన్నా సెట్స్ లోకి వెళ్ళి డైరక్షన్ చెయ్య లేకుండా కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది?.
కేవలం పవన్ కళ్యాణ్ అనే హీరో వలనే. అంతకు మించి మరేం లేదు అంటూ తన స్నేహితులు, తన టీం మెంబర్స్ చెప్తున్న మాట. ఎప్పుడో మైత్రీ మూవీస్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని హరీష్ శంకర్ తో సినిమా చేస్తానన్నది పవన్ మాట. ఒకే అందరికీ తీలిసిందే పవన్ కి కుదిరినప్పుడు సినిమాలు చేస్తాడు. లేకపోతే ప్రజల బాగు కోసం ప్రబుత్వలతో పోరాడుతాడు.
కానీ కొన్ని మీడియా సంస్థలు అయితే పవన్ అన్నీ కోట్లు, ఇన్ని కోట్లు అడ్వాన్స్ తీసుకొని మోసం చేశాడు అని రాస్తున్నాయి. ఇంకా వడ్డీల మీద వడ్డీలు పేరుకుంటున్నాయి ఆ నిర్మాణ సంస్థలకి అని ఏదో వారి వంటింట్లో వండుకున్న ఆర్టికల్స్ అన్నీ జనాల నెత్తిన రుద్దుతారు.
అరే సాంబా, ఈ జర్నలిస్టులు పవర్ ఉండి రాస్తున్నారా ? వెరే ఎవరికైనా పవర్ పెంచేటందుకు రాస్తున్నారా ? తెలిసింది రాస్తున్నారా ? లేక పవన్ కళ్యాణ్ మీద పొలిటికల్ కక్ష తో రాస్తున్నాయా ? అని పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
హరీష్ శంకర్ లాంటి డైరక్టర్ కథ చెప్పి ఎవరిని ఓప్పించలేక పోయారో డైరెక్ట్ గా హరీష్ శంకర్ ని అడిగితే చెప్తాడు కదా చారీ గారు ! ఎవరు ఎవరిని ఒప్పించలేక పోతున్నారు ? భవదీయుడు భగత్ సింగ్ లాంటి పవర్ ఫుల్ టైటిల్ పెట్టకున్నారు అంటే దానికి తగిన కథ వుండే వుంటుంది కదా అని కళ్యాణ లోకం ప్రశ్న.
మరి అలాంటి కథను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టడం ఏమిటి?
నిజంగా కథ బాగాలేదా? ఒప్పుకోలేదన్న వార్తలు కరెక్ట్ కాదా? పవన్ ను ఒప్పించే లెవెల్ కథను హరీష్ చేయలేకపోతున్నారంటే ఏమో?
ఇదే విశయాన్ని ఫాన్స్ ని అడిగితే అది కూడా నిజం ఏమో సార్ అంటూ అంటున్నారు. మరి భవదీయుడు భగత్ సింగ్ కధ సెట్స్ లోకి వెళ్ళకుండా ఏ శక్తి అడ్డం పడుతోంది. ఇవన్నీ అనుమానాలే.
ఆ అనుమానాలకు పవన్ కళ్యాణ్ ఎలా బాధ్యుడు అవుతాడు చారీ !
అసలు ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. హరీష్ రీమేక్ స్పెషలిస్ట్…పవన్ కూడా డిటో..డిటో..అలాంటి ఇద్దరు కలిసి ఒరిజినల్ కథ చేయాలని అనుకోవడం భలే గమ్మత్తు. ఇప్పుడు మళ్లీ ఇద్దరు కలిసి తమిళ తలపతి విజయ్ తెరి రీమేక్ మీదకు వచ్చారని వార్తలు మీడియా లో వినిపించడం ఇంకా గమ్మత్తు ఉంది.
అసలు మన డైనమిక్ దర్శకుడు స్ట్రెయిట్ గా పవన్ క్రియేటివ్ టీం తో ఓ మాట చెప్పవచ్చు గా, ఓ సినిమా బయట చేసుకొని వస్తాను అని? ఆ మాట చెప్పి వుంటే హరీష్ ఈపాటికి ఓ రేంజ్ హీరోలతో రెండు సినిమాలు చేసి వుండేవారు ఈ వెయిటింగ్ పీరియడ్ లో.
కానీ అలా అటుగా ఆలోచించి వుండలేదా ?
లేక ఎందుకు చేయడం లేదో తెలీసుకొనే అవకాశం లేదా చారి గారు.
లేక కోడతే కుంబస్థలమే కొట్టాలి అనేది ఈ శంకరుడి ఆలోచనా ?. చూద్దాం ఏమి జరుగుతుందో …..