టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో నిన్న మొన్నటి వరకు సినిమా ఫంక్షన్ లు అంటే గెస్ట్ ఎవరు అనే పాయింట్ వస్తే నిర్మాతలు, హీరోల చూపు మెగాస్టార్ లేదా యంగ్ హెరోస్ వైపు ప్రోడుకర్స్ దృస్టీ వుండేది.
ఇంకా మేకర్స్ కి పవర్ స్టార్ తెలిసి ఉంటే పవన్ కళ్యాణ్ కానీ వస్తే ఆడియన్స్ లో క్రేజీ సోషల్ మీడియాలో షేర్ లు ట్రోలింగ్ లు మామూలుగా వుండేవి కాదు.
ఇక్కడ చిన్న విశయం ఏంటంటే సినిమా రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా అదంతా మెగా హీరోల ఖాతాలోకి పోయేది. అప్పుడు మెగా ఫాన్స్ సోషల్ మీడియా లో ట్రోల్స్ ఎదుర్కోవలసి వచ్చేది.
ఇప్పుడు ఆహా ఓ టి టి ఆన్స్టాపబుల్ సిరీస్ హిట్ తో నట సింహం తెర మీదకు వచ్చాడు. సోషల్ మీడియా లో లేటెస్ట్ గా నందమూరి ట్రెండ్ మొదలైంది.
నందమూరి బాలకృష్ణ తొలిసారి గా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కోరిక మీద అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ నటించిన ఓ చిన్న సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు.
ఆ సినిమా ఊర్వశివో ..రాక్షసివో .। ఈ సినిమా ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చిన బాలయ్య చేసిన అల్లరి మామూలుగా లేదు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మీమ్ లు వీడియొ లు పోస్ట్ అయ్యాయి.
ఊర్వశివో ..రాక్షసివో సినిమా పబ్లిక్ లోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. అప్పటి నుండి బాలయ్య హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది.
లేటెస్ట్ గా విశ్వక సేన్ సినిమా దాస్ కా ధమ్కి ట్రైలర్ లాంచ్ కి నంద మురి నట సింహా వచ్చింది. ఢమ్కీ ఫంక్షన్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా వస్తున్నారు అనే మెసేజ్ ఫాన్స్ లో పుణకాలు వచ్చి amb మాల్ లోని దీయటర్ హౌస్ ఫుల్ చేసేసింది.
సంక్రాంతికి చిరు బాలయ్య సినిమా లు పోటీ పడుతున్నాయి. ఆ పోటీ దృశతిలో పెట్టుకొని బాలయ్య తో ఇలా పుబ్లిక్ అప్పిరియన్స్ ఇప్పిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది మెగా ఫాన్స్ కి.
ఆ మెగా – నట సింహం పోటీ దృస్తి లో పెట్టుకొని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ హడావుడి మొదలుపెట్టేశారు. నందమూరి ది గోల్డెన్ లెగ్ అని, ఎ సినిమా ఫంక్షన్ కి వచ్చినా ఆ సినిమా హిట్ అని సోషల్ మీడియాలో మొదలుపెట్టేసారు.
విశ్వక సేన్ గత సినిమా ల రిసల్ట్ పక్కన పెట్టి ప్రస్తుతం ఢమ్కీ సినిమా మీద పాజిటివ్ ట్రెండ్ ప్రచారానికి నందమూరి ఫ్యాన్స్ శ్రీకారం చుట్టేసారు.
విశ్వక సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఢంమ్కీ సినిమా ట్రయిలర్ లాంచ్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ సినిమాలో డైలాగ్ అయిన ‘నీ ఇంట్లో నా ఇంజన్’ డైలాగు అనేక సార్లు చెప్తూ హడావుడి చేసారు.
విష్వక్ కూడా తనలాగే పెద్ద పొడికి అనే మాట వేసారు. గెట్ ఆఫ్ మై కార్, మెడికల్ షాప్ దగ్గర ఆపనా లాంటి డబుల్ మీనింగ్ డైలాగులు కోట్ చేసారు.
ఇంకా బాలయ్య తన చేతికి చాలా ఉంగరాలు వుంటాయని, అలా వుండడం వల్ల గోవాలో ఎవరి చేతికి ఎక్కువ ఉంగరాలు వుంటాయనే కాంటెస్ట్ లో తను ప్రయిజ్ గెలుచుకున్నానని బాలయ్య చెప్పారు.
బాలయ్య తన స్పీచ్ ను వీలయినంత వరకు తెలంగాణ స్లాంగు ను యాడ్ చేసి ప్రసంగిండం విశేషం ధమ్కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హై లెట్ అని చెప్పాలి.
చూడాలి ధమ్కి తో విశ్వక హిట్ కొడితే అది బాలయ్య కాతా లోకి పోతుంది. కానీ ఈ ధమ్కి సినిమా 2023 ఫిబ్రవరి లో రిలీజ్ అవుతుంది.