todelu telugu movie

గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా  ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది.

ఇప్పుడు మరో హారర్-కామెడీ యూనివర్స్‌ హిందీ  సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది.

STREE

2018లో, అమర్ కౌశిక్, శ్రద్ధా కపూర్ మరియు రాజ్‌కుమార్ రావు నటించిన స్త్రీ సినిమాతో దినేష్ విజన్ నిర్మాతగా పరిచయం అయ్యాడు.

2018 లో వచ్చిన ఈ హర్రర్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2018 లో వచ్చిన స్త్రీ, 2021 లో వచ్చిన రూహి తరువాత, దినేష్ విజన్ యొక్క హారర్-కామెడీ యూనివర్స్‌లో వస్తున్న చిత్రం “భేదియా”.

Bhediya release cast trailer LAUNCH

ఈ “భేదియా” చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది.

అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి సనన్ కూడా ప్రధాన పాత్రలో నటించింది.ఇదివరకే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది.

BHEDIA

ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి పోషిస్తుంది.

“భేదియా”  మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు

ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో “గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “భేదియా” తెలుగులో తోడేలు గా  విడుదల చేస్తున్నారు.

todelu telugu movie 1 e1667403360291

మరో నిర్మాత బన్ని వాసు ఆలోచనను, అల్లు అరవింద్ నిజం చేస్తూ, ఇటీవల గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు రాష్ట్రాల్లో కాంతార తెలుగు వెర్షన్‌ను విడుదల చేసింది।

 ఈ కాంతార చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పుడు మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *