September 30 న “లాట్స్ ఆఫ్ లవ్” గ్రాండ్ రిలీజ్

lots of love director 3

 

 

ఎస్ ఎమ్ ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “లాట్స్ ఆఫ్ లవ్” ఈ నెల 30 న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్బంగా .

lots of love director 2

చిత్ర దర్శక నిర్మాత డా. విశ్వానంద్ పటార్ మాట్లాడుతూ.. ఈనెల 30న విడుదల కాబోతున్న “లాట్స్ ఆఫ్ లవ్ ” సినిమాకు దర్శకత్వంతో పాటు, నిర్మాతగా, కథ, మాటలు, మ్యూజిక్ చేయడం జరిగింది.

ఇప్పుడు వస్తున్న సినిమాలను భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ప్రేమ అంటే కేవలం ఇద్దరి ప్రేమికుల మధ్య ఉన్నదే కాదు ప్రేమ అనేది అనేక రకాలుగా ఉంటుందని ఈ సినిమా ద్వారా తెలియ జేస్తున్నాము.

అవి ప్రొఫెషనల్ లవ్ (జాబ్ ని ప్రేమించడం) ,

ఫ్యామిలీ లవ్ (ఫ్యామిలీ ని ప్రేమించడం),

డివైన్ లవ్ (అందరినీ ప్రేమించడం),

రొమాంటిక్ లవ్ (ఇద్దరి ప్రేమికుల లవ్) ,

సెల్ఫ్ లవ్ (మనల్ని మనం ప్రేమించు కోవడం)

ఇలా అయిదు రకాల డిఫ్రెంట్ లవ్ స్టోరీస్ వస్తున్న సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇస్తున్నాము.ఈ సినిమాకు డైలాగ్స్ కూడా బాగా సెట్ అయ్యాయి. కథకు తగ్గట్టు ఇందులో ఐదు డిఫ్రెంట్ పాటలు ఉన్నా .ప్రతి పాట అందరి మనసును టచ్ చేసే విధంగా ఉంటాయి.

కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కొత్తవారిని తీసుకోవడం జరిగింది. ఇందులో సెకండ్ లీడ్ లో నటించిన రాజేష్, ధర్డ్ లీడ్ లో నిహాంత్, స్వామీజీగా నటించిన కిరణ్ తో పాటు నటించిన వారందరూ కొత్తవారైనా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమ- తమ పాత్రలకు పూర్తి గా న్యాయం చేశారు.

lots of love director 1

ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉన్న ఈ సినిమాకు సెన్సార్ వారు క్లీన్ ‘యు” సర్టిఫికెట్ ఇచ్చారు.కాబట్టి ఈ నెల 30 న థియేటర్స్ లలో విడుదల అవుతున్న మా “లాట్స్ ఆఫ్ లవ్ “సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *