ప్రభాష్ హిందీ తెలుగు, ఇండియన్ సినిమా ఆదిపురుష్ టీజర్ చూడగానే.. ఫస్ఠ్ లుక్ లోనే నా చిన్నతనంలో చదివిన చందమామ కథ గుర్తుకువచ్చింది. ఇంకా రెండో సారీ మూడో సారీ టిజర్ చూస్తే ఏదో వీడియొ గేమ్ vfx విసువల్స్ లా ఉంది కానీ పాన్ ఇండియా సినిమా రేంజ్ లో అయితే లేదు.
ఆదిపురుష్ టీజర్ చూస్తే రాముడు వారది దాటి లంకకు వానర సైన్యం తో వెళ్తున్నట్టు రాక్షసులు అడ్డు కొంటున్నట్టు చదివిన చందమామ కథ గుర్తుకొచ్చింది. ఎందుకో కారణం ఉంది.
శ్రీరాముడు ఒళ్లంతా రుద్రాక్షలు ధరించి ఉండడం మాత్రమే ఇందుకు కారణం కాదు! రామకథలో విలన్ రావణుడు మాత్రమే శివ భక్తుడు. అందుకే మనం ఆ పాత్రకు శివ భక్తుడి ఆహార్యం ఉంటుంది.

ఈ ఆదిపురుష్ సినిమా టీజర్ లో రాముడు కూడా మెడలోను, భుజదండలకు, మణికట్టులకు అంతా వేరే బీభత్సమైన శివ భక్తుడి లాగా రుద్రాక్షలు ధరించి ఉన్నాడు. సరే ఇదొక్కటే కూడా గ్రాఫిక్స్ పనితనంలో సరైన శ్రద్ధ అబ్జర్వేషన్ లేదని చెప్పడానికి కారణం మా!
ఎందుకంటే ఆ రోజుల్లో శివుడొక్కడే దేవుడు అని వాదించవచ్చు. అలాగే రాముడు శివ భక్తుడు కాదని నిరూపణ ఉన్నదా అని నిలదీయవచ్చు కాబట్టి ఆ ఆలోచనలకు సినిమా మొత్తం చూసే వరకూ బ్రేక్ ఇద్దామా ?
ప్రభాష్ రాముడు గా నీటిఅడుగున తపస్సు చేస్తున్నట్టుగా ఓ దృశ్యం మనకు ఈ టీజర్ లో కనిపిస్తుంది. రాముడు చక్కగా నూలు పంచె ధోవతిలా కట్టుకుని ఉంటాడు. ఆయన ధరించే ఎర్రటి అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకుని నీటి అడుగున కూర్చుని ఉంటాడు.

ఆ అంగోస్త్రపు అంచులు.. నీటి తాకిడికి పైకి లేచి అలల్లాడుతూ ఉంటాయి. అవును మరి నీళ్లలో మునిగినప్పుడు బట్టలు పైకి లేస్తాయి. సింపుల్ ఫిజిక్స్ ఇది. నీళ్లలో మునిగే ప్రతి ఒక్కరికీ ఈ అనుభవం ఉంటుంది. అందుకే మొలకు బిగించి ఉన్న అంగోస్త్రం అంచులు నీళ్ల తాకిడికి పైకి ఎగురుతున్నట్టుగా చూపించారు. ఈ షాట్ ఎంతో శ్రద్ద తో డిజైన్ చేసి ఉంటారు.
మరి ఇక్కడే ఇంకో ఫిజిక్స్ ఫార్ములా మన బుర్రలను తెలుస్తూ ఉంటుంది. అదీ ఏంటంటే : రాముడు ధరించిన యజ్ఞోపవీతం మాత్రం స్థిరంగా ఆయన దేహాన్ని అంటిపెట్టుకుని ఫిజిక్స్ సూత్రాలకు విరుద్ధంగా ఎలా ఉంటుంది.

ఆయన జంధ్యం నూలుపోగులతో చేసినదే కదా. అయినా సరే.. అలా స్థిరంగా దిగువకే వేలాడుతూ స్థిరంగా ఉంటుంది. ఇది సరైన ఫిజిక్స్ లో అనుభవం లేని గ్రాఫిక్స్ డిజైన్ లోపమా ?.
సైన్స్ వాడకుండా కేవలనం టెక్నికల్ గా మాత్రమే చూసుకోవడం వల్ల జరిగే పొరబాట్లు నా ? లేక vfx మన అమీర్ పేట ట్రైనింగ్ సెంటర్ లో చేసించారా ?
ఏదో ఆషామాషీగా తెలుగు కార్టూన్ నెట్వర్క్ లో వచ్చే యానిమేషన్ షాట్స్ అయితే ఏదోటి అని సర్దుకోవచ్చు, కానీ అలాంటి వీడియోలు కూడా ప్రతి ఫ్రేమ్ డీటెయిల్స్ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు.

అలాంటిది పాన్ ఇండియా కాదు… కాదు… పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ లాంటి అతిపెద్ద హీరోను తీసుకుని, రాముడిలాంటి భారతదేశానికి అత్యంత పెద్ద హీరో కథను ఒక అద్భుతప్రయోగంగా యానిమేషన్ రూపంలో సెల్యులాయిడ్ ఫార్మాట్ లో చెప్పాలని అనుకున్నప్పుడు..
వందల కోట్ల రూపాయలను అందుకోసం ఖర్చుపెడుతున్నప్పుడు.. అబ్జర్వేషన్ పరంగా , హై క్వాలిటి టెక్నీషియన్స్ తో మరెంత జాగ్రత్తగా చేయాలి కదా ?. కొన్ని క్షణాలు మాత్రమే ఉన్న టీజర్ లో ఇది చిన్నలోపమే కావొచ్చు. కానీ.. అబ్జర్వేషన్, శ్రద్ధ కొరవడితే.. మొత్తం సినిమాలో మరెన్ని లోటుపాట్లు దొర్లుతాయో?

దర్శకుడు ఒక్కడూ ప్రతి విషయాన్నీ చూసుకోవాలని కాదు.. కానీ సినిమా అనేది టీమ్ వర్క్. టీమ్ లో ఎవరో ఒకరు గమనించాలి కద.
పై ప్రశ్నలు అన్నీ నెటిజన్స్ Vfx స్టూడెంట్స్ అడుగుతున్నారు. గ్రాఫిక్స్ పనితనంపై టీజర్ చూడగానే నెటిజన్లు రెచ్చిపోయారు. మోషన్ కేప్చర్ పద్ధతిలో నటుల మొహాలను ఆ రామాయణ పాత్రలకు ముడిపెట్టగలిగారేమో గానీ..
యానిమేషన్ వర్క్ చాలా పేలవంగా ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. అసలే పనితనం గొప్పగా లేని యానిమేషన్‌కు, ఇలాంటి అబ్జర్వేషన్ లోపాలు కూడా తోడైతే సినిమా ఏమైపోతుంది? టీజర్ అనేది సినిమా మీద అంచనాలు పెంచేలా, మార్కెట్ పెంచేలా ఉండాలి గానీ.. ఎదురుచూసిన అభిమానుల్ని నీరసపరిచేలా తయారైతే ఎలాగ? అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలాంటి టిజర్ రివ్యూ లు అన్నీ చూసి అదిపురూష్ టీం అయినా డైరెక్టర్ ఓం రావత్ అయినా తర్వాత వచ్చే ట్రైలర్, సినిమా లలో సారి చేసు కొంటారు అని మేము ఇంత డీటైల్ గా రివ్యూ రాస్తున్నాము.