‘అవతార్’ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన విజువల్ వండర్ సినిమా. మొదటి భాగంలో ‘పండోరా’ గ్రహం అనే యూనివర్స్ కథాంశంతో రూపొందించి ప్రపంచం వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
అంతేకాకుండా అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన మూవీగా రికార్డు కూడా సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్స్ రూపొందిస్తానని జేమ్స్ కామెరూన్ గతంలోనే తెలిపాడు. అన్నట్లుగానే ఈ సినిమాకి రెండో భాగంగా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ట్రైలర్ ఈ రోజు విడుదలయ్యింది.
మరి ట్రైలర్‌లో హైలెట్స్ ఏంటో తెలుసు కోవాలని ఉందా!? అయితే ట్రైలర్ తప్పకుండా చూడాల్సిందే.
‘అవతార్’ లో శామ్ వర్తింగ్‌టన్ కీలక పాత్ర పోషించి జేక్ సల్లీఅనే పాత్రలో కనిపించాడు. దర్శకుడు జేమ్స్ తాజాగా విడుదల చేసిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ట్రైలర్‌లో జేక్ సల్లీ కుమార్తెను పరిచయం చేస్తూ ట్రైలర్ సాగింది. పండోరానుమరోసారి విజువల్ వండర్‌గా చూపిస్తూ.. సౌండ్ ఎఫెక్ట్స్‌తో అబ్బురపరచాడు.
‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదల కానుంది. ఇండియాలో ఈ సినిమా ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
4కె, 3డీ తో పాటు అందుబాటులో ఉన్న అన్ని ఫార్మాట్స్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
రెండవ భాగంగా వస్తున్న ‘అవతార్’ ది వే ఆఫ్ వాటర్ ట్రైలర్ చూశాక ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ తారా స్థాయకి చేరేలా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ ది వేవ్ ఆఫ్ వాటర్ ను తెరకెక్కించాడు.