Sritarampuram lo prema janta: దిల్‌ రాజు చేతుల మీదుగా ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ ట్రైలర్‌ లాంచ్‌

Sitarampuram lo trailer out

 

 

శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌ పై వినయ్‌ బాబు దర్శకత్వంలో బీసు చందర్‌ గౌడ్‌ నిర్మించిన చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట. రణధీర్‌, నందిని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

త్వరలో విడుదల కానున్నఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు లాంచ్‌ చేశారు. అనంతరం

Sitarampuram lo 1 1

దిల్‌ రాజు మాట్లాడుతూ…‘‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’’ టైటిల్‌తో పాటు ట్రైలర్‌ కూడా చాలా బావుంది. హీరో హీరోయిన్ల జంట చూడముచ్చటగా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో అర్థమైంది.

ఈ చిత్రం ఘన విజయం సాధించి సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

Sitarampuram lo 3

దర్శకుడు వినయ్‌ బాబు మాట్లాడుతూ…‘‘మా చిత్రం ట్రైలర్‌ దిల్‌ రాజు గారి చేతుల మీదుగా లాంచ్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్‌ నచ్చి మా చిత్రం యూనిట్‌ ప్రశంసించారు.

ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ట్రైలర్‌ మార్కెట్‌ లోకి వచ్చింది. త్వరలోనే సినిమా రిలీజ్‌ కు ప్లాన్‌ చేస్తున్నాం. నిజాయితీ గా ప్రేమించుకున్న ప్రతి యువతీ యువకులు చూడాల్సిన చిత్రమని’’అన్నారు.

Sitarampuram lo 5

నిర్మాత బీసు చందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ…‘‘ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’’.

రణధీర్‌ హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు.

నందిని హీరోయిన్‌గా నటించింది.

Sitarampuram lo 4

మా చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన దిల్‌ రాజు గారికి ధన్యవాదాలు. త్వరలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అన్నారు.

సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ, చంద్రకాంత్‌, భాష, నిట్టల్‌, బి హెచ్‌ ఇ ల్‌ ప్రసాద్‌ , మిర్చి మాధవి, సంధ్య రాణి, సుష్మా , పరిమళ తదితరులు నటించినారు.

Sitarampuram lo 2

ఈ చిత్రానికి డిఓపి: విజయ్‌ కుమార్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, ఎన్టీఆర్‌, ఫైట్స్‌: రామ్‌ సుంకర, పాటలు :సుద్దాల అశోక్‌ తేజ, డాడీ శ్రీనివాస్‌, అభినయ శ్రీనివాస్‌ సంగీతం :ఎస్‌ ఎస్‌ నివాస్‌, కోరియోగ్రఫి : అజయ్‌ శివ శంకర్‌, గణేష్‌, మహేష్‌. పీఆర్వోః చందు రమేష్‌, నిర్మాత:బీసు చందర్‌ గౌడ్, రచన,దర్శకత్వం:వినయ్‌ బాబు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *