మొదటి రోజును కలెక్షన్స్ మించి రెండవ రోజు..
900 శాతం పెరిగిన కలక్షన్స్…..
కాంతార కు కాసుల వర్షం కురిపిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు..
తెలుగులో రెండో రోజు 11.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన కాంతార సినిమా …
‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం “కాంతార”.

ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.
కన్నడ లో మొదలైన కాంతార కాసుల వర్షం ఇప్పుడు భారత దేశం మొత్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం పదిహేడవ రోజు కి వచ్చేసరికి 20 కోట్లు గ్రాస్ ను సాధించింది.

ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం అవ్వడం అనేది అరుదైన విషయం.
“కాంతార” చిత్రం రిలీజైన పదిహేడవ రోజు కూడా 900 శాతం కలక్షన్స్ పెరగడం అనేది “కాంతార” చిత్రం విజయానికి నిదర్శనం.
కన్నడ లో భారీ విజయం సాధించిన ఈ సినిమాను,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు.

కర్ణాటక లో 17 రోజులలో సాదించిన కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే అదిగమించిన ఈ “కాంతార’ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కనక వర్షం కురిపిస్తుంది.
థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది.
రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది.

ముఖ్యంగా ఈ “కాంతార” క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం.
చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి.
అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.
ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా అంతకు మించిన విజయఢంకాను మోగిస్తుంది.