తెలుగు ప్రేక్షకులకు, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి పేరు పేరునా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ,

విశాఖ టాకీస్ పైన ఈ నెల 14న నితిన్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “అడవి” సినిమాను….
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన “రెబల్” సినిమాను నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పైన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నామని ఆ సంస్థల అధినేతలు నట్టి కుమార్, నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు.
ఈ రెండు సినిమాలను సౌండ్ సిస్టమ్ ను మరింత ఆధునీకరించి, అన్ని తరగతుల ప్రేక్షకులను అలరించేలా నవీనకరించామని వారు పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇండియాలోని పలు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వీటిని వందలాది థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నామని వారి వివరించారు

“రెబల్“ సినిమాను దాదాపు 600 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. ఇటీవల “3” (కొలవరి డి) సినిమాను నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పైన రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందేనని, దానికి అద్భుత స్పందన లభించిందని..
అలాగే ఈ రెండు సినిమాలు కూడా నేటి యువతరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తంచేశారు.