“స్వర్ణ పిక్చర్స్ & టైగర్ హిల్స్” టీమ్ బ్యానర్స్ తరుపున సినిమా ప్రేక్షక దేవుళ్ళకు, మిత్రులందరికి హృదయ పూర్వక “దసరా శుభాకాంక్షలు”.
స్వర్ణ పిక్చర్స్ & టైగర్ హిల్స్ బ్యానర్స్ లో యంగ్ డైరెక్టర్ రాజశేఖర్ రావి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
మొదటి చిత్రాన్ని డిసెంబర్ లో రీలిజ్ కి ప్ల్యాన్ చేస్తుండగా, దసరా శుభ సందర్బాన్ని పురస్కరించుకొని స్వర్ణ పిక్చర్స్ సంస్థ తమ రెండోవ చిత్రం అనౌన్స్ చేసారు.
రెండోవ చిత్రం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని ప్రముఖ హీరో నటించబోతుండగా, జనవరి లో సెట్స్ మీదకి తీసుకు వెళ్తున్నట్టు చిత్ర దర్శకుడు రాజశేకర్ రావి తెలియజేశారు.
మా రెండవ చిత్రానికి కూడా మా మొదటి చిత్ర దర్శకుడు రాజశేఖర్ రావి దర్శకత్వం చేపట్టడం విశేషం. త్వరలోనే, ప్రెస్ మీట్ లో ఈ రెండు చిత్రాలకి సంబంధించిన తారాగణం వివరాలు వెల్లడిస్తామని స్వర్ణ పిక్చర్స్ అధినేత తెలియజేశారు.
పబ్లిసిటీ డిజైనర్: టి.ఎస్.ఎస్. కుమార్
స్టంట్: డ్రాగన్ ప్రకాష్
పి.ఆర్.వో: వెంకటేష్ – ప్రగడ
లిరిక్స్: రాంబాబు గోసాల
ఎడిటర్: గౌతమ్ రాజ్
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్. రాజేష్
డీవోపీ: ఏకే.ఆనంద్
స్టోరీ: ప్రవీణ్ రాజ్
డైరెక్టర్: రాజశేఖర్ రావి
ప్రొడ్యూజర్స్: స్వర్ణ పిక్చర్స్