Natti Kumar open letter to Film Chamber: సినిమా షూటింగులు నెల రోజులు అపి ఏం సాధించారో దిల్ రాజు గారు చెప్పాలి !

నట్టి kumar letter to chamber

To

THE PRESIDENT AND SECRETARY,

TELUGU FILM CHAMBER OF COMMERCE,

FILM NAGAR, HYDERABAD.

RESPECTED SIR,

QUBE, UPO తదితర డిజిటల్ ప్రొవైడర్స్ చార్జీలు చిన్న సినిమాల పాలిట శాపంగా తయారయ్యింది. Chamber నుంచి నెల రోజుల పాటు (30 days) shootings ఆపివేసి, మీరు ఏం సాధించారో ఛాంబర్ తరపున నాయకులు తెలియజేయాలి.

1) QUBE,Multiflex PVRలో only one show వేయడానికి అయినా 7 shows వేయడానికి అయినా Rs.9.880/- చిన్న సినిమాలకు సైతం చెల్లించవలసివస్తోంది.

2). CINE POLICE only one show వేయడానికి అయినా 7 shows వేయడానికి అయినా Rs.7,080/- చిన్న సినిమాలకు సైతం చెల్లించవలసివస్తోంది.
natti kumar letter 1
ఇది చిన్న సినిమా నిర్మాతలకు తీవ్ర భారంగా పరిణమించింది నిజం కాదా!. Multiflex లలో మినిమం 35 టికెట్స్ లేనిదే అస్సలు shows ఇవ్వరు. చెప్పా పెట్టకుండావే సినిమా తీసేస్తారు.

చిన్న నిర్మాతల షూటింగ్స్ ఆపివేసి, ఛాంబర్ నుంచి 30 రోజుల పాటు మీరు చేసింది ఏంటి? ఎప్పుడు చిన్న నిర్మాతలకు తమ సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. ఎంతసేపు పెద్ద నిర్మాతలకు వత్తాసు పలుకుతూ,

ఈ నెల రోజులలో ఏం సాధించారో దిల్ రాజు గారు, స్రవంతి రవికిశోర్ గారు, దామోదరప్రసాద్ గారు, సుప్రియ గారు తదితరులు సమాధానం చెప్పాలి.

3). ఫెడరేషన్ లో ఎంప్లాయిస్ కు చిన్న సినిమాలకు ఉన్న రేట్లలో 25 శాతం తగ్గించి చేస్తారని, చిన్న నిర్మాతలను 10 సంవత్సరాలుగా నమ్మించి మోసం చేశారు.

ఇప్పుడున్న పరిస్థితులలో చిన్న నిర్మాతలకు 15 శాతం రేట్లు పెంచారు. చిన్న నిర్మాతలకు మీరు ఏం న్యాయం చేసినట్లో ఒక్కసారి ఆలోచించండి.

natti kumar 1

థియేటర్స్ రేట్లు, క్యాంటిన్ రేట్లు వంటివన్నీ తగ్గుతాయని, చిన్న సినిమాలకు అన్నీ వరాలే అని చెప్పిన సెక్టార్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, మోహన్ గౌడ్ గారు, రామసత్యనారాయణ గారు తదితరులు అంతా ఏం సాధించారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫ్యాషన్ కోసమో కొంతమంది చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను ఎన్నో ఇబ్బందులను సైతం అధిగమించి, ఎదురు డబ్బులు కట్టుకుని మరీ తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు తప్ప సినిమానే ప్రాణంగా, సినీ పరిశ్రమలో సినిమానే జీవితంగా నమ్ముకుని బతుకుతున్న చిన్న నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసే పరిస్థితులలో లేరు.

ఛాంబర్ పెద్దలు వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాధానం చెబుతారని ఆశిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *