Mercy killing Movie Grand release on April 12th: ఆసక్తికరంగా “మెర్సి కిల్లింగ్” ట్రైలర్ ,  థియేటర్స్ లో విడుదల ఎప్పుడంటే !

IMG 20240403 WA0084 e1712166344250

 సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన సినిమా “మెర్సి కిల్లింగ్” సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తుండగా ఎం.ఎల్.రాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, సాంగ్స్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు.

Mercy Killing Movie Pre Release Event 4 e1711788277655

“ప్రతి భారతీయుడు గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి… ఐ వాంట్ మెర్సీ కిల్లింగ్” అంటూ స్వేచ్ఛ అనే అమ్మాయి చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. అలాగే సాయి కుమార్ చెప్పిన “చంపితేనే పరువు ఉంటుంది అంటే ఏమైనా చేస్తాను” డైలాగ్ ఆలోచింపజేస్తుంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది.

నటీనటులు:

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు.

సాంకేతిక నిపుణులు: 

బ్యానర్: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్, డైరెక్టర్: వెంకటరమణ ఎస్, నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల, సమర్పణ: శ్రీమతి వేదుల బాల కామేశ్వరి, సినిమాటోగ్రఫీ: అమర్.జి, సంగీతం: ఎం.ఎల్.రాజ, ఎడిటర్: కపిల్ బల్ల, ఆర్ట్: నాయుడు, మాటలు: వై. సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పృథ్వి కడియం, లైన్ ప్రొడ్యూసర్: బాబీ శివకోటి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *