KANTARA TELUGU DAY1 COLLECTIONS: తెలుగులో “కాంతార” ప్రభంజనం, క్లైమాక్స్ లో పునకాలే, మొదటి రోజు ఎంత వచ్చింది అంటే ?

కాంతారా ఫస్ట్ డి కలెక్షన్స్ 5 కోట్లు

 

‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం “కాంతార”.

ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం చూపిస్తుంది.

థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది.

kantara కన్నడ release date

“కాంతార” రిలీజైన మొదటి రోజే 5 కోట్లు గ్రాస్ సాధించింది.

ముఖ్యంగా ఈ “కాంతార” క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి.అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకునికి ఒళ్ళు గగుర్పుడిచేలా ఈ చిత్ర క్లైమాక్స్ ను మలిచాడు

KANTARA HERO HEROINE 3 e1665588543623

రిషబ్ శెట్టి. తనలో ఉన్న దర్శకుడుని నటుడు డామినేట్ చేసాడు అనేంతలా ప్రేక్షకుడికి మర్చిపోలేని విజువల్ ట్రీట్ ఇచ్చాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు “కాంతార” క్లైమాక్స్ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు.

ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా అదే మాదిరిగా విజయఢంకాను మోగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *