billa re release in 4K

టాలీవుడ్ లో బ్లాక్ బూస్టర్స్ గా నిలిచిన పాత సినిమాలను రీ మాస్టర్ చేసి మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు విడుదలయ్యాయి.

ప్రస్తుతం ప్రభాస్ ‘బిల్లా’ సినిమా 4K లేటెస్ట్ వెర్షన్‌ ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా యూఎస్‌లో రికార్డు స్థాయిలో విడుదల కాబోతుంది.

Billa 11 years

యూఎస్‌లో 70 పైగా లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నారు.
రీ రిలీజ్ మూవీస్‌లో ఇది అత్యధిక థియేటర్స్ లిస్ట్ అని చెప్పొచ్చు.

ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజవుతున్న ఈ సినిమాకి అభిమానులు ఇప్పటి నుంచే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.

billa poster 2
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు కీలక పాత్రలో నటించారు. అనుష్క, నమిత, హన్సిక కథానాయికలుగా నటించారు.

గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని యూఎస్‌లో అత్యధిక లోకేషన్స్‌లో ప్రభాస్ పుట్టినరోజు సధర్భంగా ప్రదర్శించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *