Baby’ film director Sai Rajesh Receives Car gift from Producers: “బేబీ” చిత్రం సక్సెస్ కంటే ముందుగానే దర్శకుడు సాయి రాజేష్ కి కారును గిఫ్టుగా ఇచ్చిన “మాస్ మూవీ మేకర్స్”

baby director sai rajesh 2

 68వ జాతీయ సినిమా అవార్డులలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో ‘కలర్ ఫోటో’ చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకున్నారు కథ రచయిత మరియు నిర్మాత సాయి రాజేష్.

2020 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. ప్రస్తుతం సాయి రాజేష్ “బేబీ” అనే తెరకెక్కిస్తున్నారు.

anand devarakonda e1665772895821

యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’.

ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

baby director sai rajesh e1665772932253

న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది.ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది.ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన పోస్టర్స్ “బేబి” అంచనాలను పెంచాయి.

త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ మరియు టీజర్ రిలీజ్ కానుంది. ఆ తరువాత అధికారికంగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నారు.

“బేబీ” చిత్రం రష్ చూసిన నిర్మాతలు ఎస్ కే.ఎన్ & మారుతి,
దర్శకుడు సాయి రాజేష్ కు ఎం.జి.హెక్టార్ కారును బహుమతిగా అందించారు.

చెప్పిన కథను అలానే అద్భుతంగా తెరకెక్కించినందుకుగాను ఆనందంతో ఈ బహుమతిని అందించారు.

baby director sai rajesh 1 e1665773044940
మాములుగా సినిమా రిలీజై విజయవంతం అయిన తర్వాత గిఫ్టులు ఇస్తుంటారు. కానీ రిలీజ్ కు ముందుగానే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా గిఫ్ట్ ఇవ్వడం అనేది అరుదుగా జరుగుతుంది.

ఏదేమైనా ఈ సినిమా పై నిర్మాత ఎస్ కె ఎన్ మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ రోజుల్లో , టాక్సీవాలా ,మంచి రోజులొచ్చాయి లాంటి చిత్రాలతో హిట్ అందుకున్న ఎస్ కె ఎన్ ఈ సారి బేబీ చిత్రంతో కూడా హిట్ అందుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *