SITARAMAPURAMLO OKA PREMA JANTA: సీతారామపురంలో ఒక ప్రేమజంట’ ప్రీ`రిలీజ్‌ వేడుకలో అతిథుల సందడి!

SAVE 20221113 161358

‘సీతారామపురం’’ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి: ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ ప్రీ`రిలీజ్‌ వేడుకలో అతిరధుల అసాక్తాతని నీ వ్యక్తం చేశారు.

శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై బీసు చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది.

SAVE 20221113 161348

ఎం. వినయ్‌ బాబు దర్శకత్వంలో రణధీర్‌, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదలకానుంది.

ఈ సందర్భంగా శనివారం రోజు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రీ `- రిలీజ్ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ…‘‘నిర్మాత నాకు బాగా కావాల్సినవాడు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం చేయడం గొప్ప విషయం.

SAVE 20221113 161501

హీరో రణధీర్‌కు ఒక మంచి హీరోగా ఎదడానికిగల అన్ని క్వాలిటీస్‌ ఉన్నాయి. పాటలు, ట్రైలర్స్‌ , టైటిల్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ..ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

SAVE 20221113 161441
తెలుగు ఫిలించాంబర్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ…‘‘ఎన్టీఆర్‌ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణగారు ఇలా ఎంతో మంది గొప్ప హీరోలు రైతు కుటుంబం నుంచి వచ్చినవారే. అలాగే రైతు కుటుంబం నుంచి వస్తోన్న రణధీర్‌ కూడా హీరోగా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకంటున్నా.

సీతారామ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్‌ కావడం ఖాయం. సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సినిమాకు ప్రాణం. దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు’’ అన్నారు.

SAVE 20221113 161423
దర్శకుడు ఎమ్‌ వినయ్‌ బాబు మాట్లాడుతూ…‘‘దర్శకుడు ఎం. వినయ్‌ బాబు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో మంచి కంటెంట్‌తో పాటు కమర్శియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఇప్పటికే విడుదల్కెన టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుంచి అత్భుతమైన స్పందన వచ్చింది .

ఈ నెల 18న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని మా సినిమా ఏ మాత్రం డిజప్పాయింట్‌ చేయదు’’ అన్నారు.

SAVE 20221113 161501
నిర్మాత బీసు చందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ…‘విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది. ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి మా చిత్రానికి ఎంతో డిఫరెన్స్‌ ఉంది. దర్శకుడు వినయ్‌బాబు అత్భుతమైన ట్విస్ట్‌లతో సినిమాను ఇంట్రెస్టింగ్‌గా తెరక్కించారు.

కచ్చితంగా ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తోంది. అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. ఈ నెల 18న వస్తోన్న మా చిత్రాన్ని యువతో పాటు ప్రతి తల్లీదండ్రి చూసేలా ఉంటుందన్నారు.
హీరో రణధీర్‌ మాట్లాడుతూ..‘‘దర్శకుడు వినయ్‌ బాబు గారి సపోర్ట్‌ తో ఈ సినిమా చేయగలిగాను.

SAVE 20221113 161406

నన్ను నమ్మి మా నాన్నగారు హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించారు. మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కుమార్‌ గారు ఎంతో సపోర్ట్‌ చేశారు’’ అన్నారు.

హీరోయిన్‌ నందిని మాట్లాడుతూ..‘‘ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు’’ అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…‘‘ఇటీవల సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది.

SAVE 20221113 161452

డైరక్టర్‌ వినయ్‌ ఒక మంచి కంటెంట్‌తో సినిమా తీశాడు. నిర్మాత రాజీ పడకుండా కథకు కావాల్సిన ఖర్చు పెట్టాడు. పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు. సినిమా విజయవంతం కావాలన్నారు.

ప్రముఖ దర్శకుడు వియన్‌ ఆదిత్య మాట్లాడుతూ..‘‘వినయ్‌ బాబుకి దర్శకుడుగా మంచి అనుభవం ఉంది. సినిమా చూశాను. కంటెంట్‌ బావుంది. దర్శకుడు తెరకెక్కించిన విధానం బావుంది. హీరో రణధీర్‌ కొత్త హీరోలా కాకుండా ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించాడు. హీరోయిన్‌ పాత్ర కూడా బావుంది’’ అన్నారు.

దర్శకుడు చంద్రమహేష్‌ మాట్లాడుతూ…‘‘సినిమా చూశాను. టైటిల్‌ ఎంత బావుందో సినిమా అంత బావుంది. కథ, మాటలు, పాటలు ఇలా అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సినిమా సక్సెస్‌ సాధించాలన్నారు.

SAVE 20221113 161441
నటుడు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వై, కాశీవిశ్వనాథ్‌ మాట్లాడుతూ…‘‘పాటలు, ట్రైలర్‌ బావున్నాయి. దర్శకుడు వినయ్‌ బాబు మంచి ప్రతిభావంతుడు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

SAVE 20221113 161348
నటుడు అమిత్‌ మాట్లాడుతూ..‘‘నేను ఇందులో మెయిన్‌ విలన్‌గా నటించాను. రణధీర్‌కి ఇది తొలి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించాడు’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో క్రిష్‌, జయంత్‌ గౌడ్‌ పాల్గొన్నారు. రణధీర్‌, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ, నిట్టల్‌, మిర్చి మాధవి, సంధ్య సన్‌ షైన్‌, సుష్మా గోపాల్‌, భాషా, చంద్రకాంత్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రసాద్‌, లేట్‌ శివ శంకర్‌ మాస్టర్‌, సురేష్‌.. తదితరులు నటించారు.

SAVE 20221113 161414
డిఓపి: విజయ్‌ కుమార్‌ ఎ. ఎడిటింగ్‌: నందమూరి హరి, ఎన్టీఆర్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌.నివాస్‌, ఫైట్స్‌: రామ్‌ సుంకర, కొరియోగ్రఫీ: అజయ్‌ శివ శంకర్‌, గణేష్‌, మహేష్‌, పిఆర్‌ఓ: చందు రమేష్‌, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ఎం. వినయ్‌ బాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *