SHIYA GOWTHAM MARO MAHABHARATHAM MOVIE OPENING UPDATE: శియా గౌతమ్ ప్రధాన పాత్ర లో “మరో మహాభారతం” చిత్రం ప్రారంభం !

SHIYA GOWTHAM

ఎస్ఎస్ క్రియేషన్స్ నిర్మాణంలో ఎమ్ఎస్ రెడ్డి సమర్పణలో జగదీష్ దూగాన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మరో మహాభారతం. శియా గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ లేడి ఒరియంటెడ్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

హీరో ఆకాష్ పూరి ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టడం జరిగింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

SHIYA GOWTHAM 2 e1666722572422

ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ దూగాన మాట్లాడుతూ…
ఇది చాలా ప్రేత్యేకమైన సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. శియా గౌతమ్ ఈ కథకు కరెక్ట్ గా సెట్ అవుతారని ఆమెను తీసుకోవడం జరిగిందని తెలిపారు.

SHIYA GOWTHAM 1 e1666722528597

ఆకాష్ పూరి మాట్లాడుతూ…

మరో మహాభారతం టైటిల్ బాగుంది. మంచి కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, డైరెక్టర్ జగదీష్ దూగాన గారికి ఇది మంచి సినిమా అవ్వాలి అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *