NEW MOVIE RICE MILL LAUNCHED TODAY: పూజా కార్యక్రమాలతో ‘రైస్ మిల్’ మూవీ ప్రారంభం

rice mill movie opening

శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కబోతోన్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్‌ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

హేమంత్ కుమార్, చైతన్య అరుణ్, జూనియర్ రాజనాల, శాంతి ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రంతో బ్రహ్మాజీ పోలోజు దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. సిఎమ్ రమేష్, బి. రాజేష్ గౌడ్ నిర్మించనున్నారు.

సుధాకర్ విశ్వనాధుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. పూజా కార్యక్రమానికి చిన్నపరెడ్డి, చండి ప్రసాద్, అంకయ్య, శ్రీనివాస్ గుప్తా, శ్రీనివాస్ పవన్ కుమార్ తదితరులు హాజరై.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

rice mill movie opening 3 e1666722053582

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘రైస్ మిల్ చిత్ర పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. విలేజ్ లైఫ్‌కి సడెన్‌గా వచ్చే అర్బన్ లైఫ్‌కి మధ్య తేడాని బేస్ చేసుకుని ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది.

ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ బ్లెసింగ్స్ అందిస్తారని ఆశిస్తున్నాము. ఇంకో 10, 15 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అని తెలిపారు.

rice mill movie opening 3 1 e1666722089287

హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘శ్రీ మహా ఆది కళాక్షేత్రం బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోగా ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రైస్ మిల్ స్టోరీ యూత్‌ని ఆకర్షించే విధంగా ఉంటుంది. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’’ అని అన్నారు.

rice mill movie opening 2 1

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు సంవత్సరం నుండి ఈ టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. ఇది నాకు హోమ్ బ్యానర్ వంటిది. ఫోన్‌లోనే రమేష్ గారు నాకు ఈ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకు సంగీతం ఇచ్చేందుకు నేను కూడా ఎంతో ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను.

ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని, సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

rice mill movie opening 3 2 e1666722164666

హేమంత్ కుమార్, చైతన్య అరుణ్, జూనియర్ రాజనాల, శాంతి ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి
స్టంట్స్: E౩ శంకర్
స్టోరీ & డైలాగ్స్: సీఎం మహేష్
మ్యూజిక్: చరణ్ అర్జున్
కెమెరా: ప్రసాద్ ఈదర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుధాకర్ విశ్వనాధుని
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు: సీఎం మహేష్ & బి. రాజేష్ గౌడ్
స్క్రీన్‌ప్లే & డైరెక్షన్: బ్రహ్మాజీ పోలోజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *