Sharapanjaram Lyrical song release: “శరపంజరం”చిత్రం లోని “రావయ్యా నందనా రాజా నందన “పాటను విడుదల చేసిన విజయశాంతి

sara panjaram movie song release 4

గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి  వ్యతిరేకత కనపరచారు అనే  పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్ చిత్రమే “శరపంజరం”

.దోస్తాన్ ఫిలిమ్స్ పతాకంపై టి.గణపతిరెడ్డి ,మామిడి హరికృష్ణ సహకారం తో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలోని “రావయ్యా నందనా రాజా నందన ” రెండవ పాటను ప్రముఖ జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి పాడిన ఈ పాటను ఇటీవల లేడి సూపర్ స్టార్ విజయశాంతి విడుదల చేసారు

sara panjaram movie song release 2
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ…ఈ చిత్రం లోని పాట చూసాక పల్లెదనం కళ్ళకు కట్టినట్టు కనబడుతుతుంది.ఆనాడు దొరలు తమ స్వార్ధం కోసం ఆడవాళ్ళని ఎలా వాడుకున్నారో అందరికి తెలిసిన విషయమే, ఈనాటి దొర కూడా ఎలా చేస్తున్నాడో తెలిసిన విషయమే సమయం మారింది కానీ వ్యక్తి మనస్తత్వం మారలేదు అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలుస్తుంది అనిపిస్తుంది.

ఈ జీరో బడ్జెట్ సినిమా పెద్ద హిట్ కావాలని చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు .ప్రోత్సకులు టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ : ఈ జీరో బడ్జెట్ సినిమా ప్రారంభమైన అప్పటి నుండి మెరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంలోని “రావయ్యా నందనా రాజా నందన ” పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.ఈ పాటపెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.

sara panjaram movie song release 1
సంగీత దర్శకుడు మల్లిక్ ఎం వి కె మాట్లాడుతూ … ఈ మూవీ కాన్సెప్ నచ్చి ఉచితంగా సంగీతాన్ని అందించటానికి ఒప్పుకున్నాను ఈ సందర్భంలో నాకు సహకరిచిన లిరిక్ రైటర్స్ , సింగెర్స్ , వాయిద్యకారులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు అన్నారు.

దర్శకుడు నవీన్ కుమార్ గట్టు మాట్లాడుతూ:.. ఈ పాట లేడీ సూపర్ స్టార్ చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషం చిన్నప్పటి నుండి తన సినిమాలు చేస్తూ పెరిగా.ఈ పాట చూసాక ఆమె ఈ పాట ఎంత సహజంగా ఉంది అనే మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి మాట్లాడుతూ:.. మొదటిసారి ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేయడం నా అదృష్టం ఈ అవకాశం కలిపించిన దర్శకుడికి నా కృతజ్ఞతలు.

sara panjaram movie song release 3
నటీనటులు
నవీన్ కుమార్ గట్టు,లయ, వరంగల్ బాషన్న, ఆనంద్ భారతి,జబర్దస్త్ వెంకీ, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ రాజమౌళి,
జబర్దస్త్ మీల్కీ, అలువాల సోమయ్య, మౌనశ్రీ మల్లిక్, మేరుగు మల్లేశం గౌడ్, కళ్యాణ్ మేజిషియన్ మానుకోట ప్రసాద్, కృష్ణ వేణీ, ఉదయశ్రీ ,రజీయ, ఉషా, సకేత, రాజేష్
సుదర్శన్, నరేందర్, దయ, భరత్ కామరాజు, ప్రసాద్, ప్రశాంత్, అఖిల్ (బంటి)

sara panjaram songs

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : దోస్తాన్ ఫిలిమ్స్ ప్రోత్సకులు ; టి.గణపతి రెడ్డి , మామిడి హరికృష్ణ
కథ,మాటలు,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: నవీన్ కుమార్ గట్టు.
సంగీతం : మల్లిక్ ఎం వీ కే,
కెమెరా: మస్తాన్ సిరిపాటి,
ఎడిటింగ్: యాదగిరి కంజర్ల,
డీ ఐ : రాజు సిందం.
పాటలు : మౌనశ్రీ మల్లిక్,గిద్దె రాం నర్సయ్య,కిరణ్ రాజ్ ధర్మారాపు,అద్వైత్ రాజ్,రాంమూర్తి పొలపల్లి, ఉమా మహేశ్వరి రావుల.
పి.ఆర్.ఓ : ఆర్.కె.చౌదరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *