శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘ది ఘోస్ట్’ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పదం. రా, ఇంటల్జెన్స్ ఫీల్డ్ లో ఈ పదానికి ఒక పవర్ వుంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఇందులో కథానాయకుడి కోడ్ ఘోస్ట్. అండర్ వరల్డ్ అతనికి పెట్టినపేరు ఘోస్ట్
నాగార్జున గారిని కలసి కథ చెప్పడం ఎలా అనిపించింది ?
నిర్మాతలు సునీల్, శరత్ మరార్ లని ముందు కలవడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ చర్చనడుస్తునపుడు.. వేరేది చేద్దామని నాగ్ సర్ అన్నారు. నాగార్జున గారంటే నా మనసులో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వుంది. ఆ రకంగా చూపించాలని కథ రాయడం జరిగింది.
నా కెరీర్ లో హీరోకి కథ రాయడం ఇదే తొలిసారి. ఆయన ఇంటన్సిటీ, స్టయిల్, గ్రేస్ ఉపయోగించుకొని , ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది.
తక్కువగా మాట్లాడి బలమైన యాక్షన్స్ తో ఇంపాక్ట్ చూపే విధంగా వుంటుంది. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. ప్రతి యాక్షన్ సీన్ వెనుక బలమైన ఎమోషన్ వుంటుంది.
తొలిసారి హీరో అనుకోని కథ రాశారు కదా ? ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ?
నిజానికి హీరోకి కథ రాయడం ఈజీ. మనకి ఒక స్పష్టమైన క్లారిటీ, డైరెక్షన్ వచ్చేస్తుంది. మన బౌండరీలు మనకి తెలిసిపోయినప్పుడు ఆ పరిధిలోనే ఆలోచిస్తాం. నాకు అడిగితే ముందు కథ రాసుకొని తర్వాత అందులో నటులని ఫిట్ చేయడమే కష్టం.
ది ఘోస్ట్ లో తమహగనే లాంటి ఆయుధాలు కూడా డిజైన్ చేశారు కదా ?
కథ రాసుకున్నపుడు ప్రతి పాత్రకు ఒక బ్యాక్ స్టొరీ రాస్తాం. అలాంటి బ్యాక్ స్టొరీ ఉన్నపుడే పాత్రకు బలం చేకూరుతుంది. నాగార్జున గారు ఇందులో 40 ఏళ్ల ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తారు. అయితే ఈ జర్నీలో ఆయన చాలా మిషన్స్ లో పాల్గొనివుంటారు.
అలా తన జర్నీ లో జపాన్ వెళ్లినపుడు అక్కడ ఒక వ్యక్తి ఇచ్చే మెటల్ తమహగనే. ది ఘోస్ట్ కంప్లీట్ ఫిక్షన్ స్టొరీ. 12 యాక్షన్ సీక్వెన్స్ లు వుంటాయి. ప్రేక్షకులకు అడ్రినల్ రష్ ఇచ్చే సినిమా.
హీరోయిన్ సోనాల్ చౌహాన్ గురించి ?
సోనాల్ చౌహాన్ చాలా అంకిత భావంతో పని చేసే నటి. మాకు చాలా సమయం ఇచ్చి చాలా హార్డ్ వర్క్ చేసి బ్రిలియంట్ ఫెర్ ఫార్మ్ చేసింది.
మీ తొలి మూడు చిత్రాలు సొంత ప్రొడక్షన్ లో చేశారు కదా.. ఇప్పుడు వేరే ప్రొడక్షన్.. ఈ విషయంలో ఎలాంటి తేడాలు.. సవాళ్ళు వుంటాయి?
క్రియేటివ్ గా ఆలోచిస్తే సొంత ప్రొడక్షన్ నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు.
సొంత ప్రొడక్షన్ చేయడం వలన నిర్మాత కష్టాలు కూడా తెలుసు. ఎంతవరకూ రాజీపడాలో తెలుసు. అయితే సొంత ప్రొడక్షన్ లో రిలీజ్ సమయంలో సమస్య వస్తుంది.
సినిమాని రిలీజ్ చేయడం అంత తేలిక కాదు. మంచి ప్రోడక్ట్ ని రెడీ చేసిన తర్వాత దాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం. నా ప్రొడక్షన్ లో వచ్చిన చిత్రాలకు రిలీజ్ దగ్గర ఇబ్బందిపడ్డా.
అయితే వేరే నిర్మాణ సంస్థలో చేస్తున్నపుడు కూడా నిర్మాత సెట్ లో వుంటే బావుంటుంది. నావరకూ నిర్మాతని ప్రతి రోజు సెట్ కి రమ్మని చెబుతాను. నిర్మాత సెట్ లో వుంటే పనులు త్వరగా జరుగుతాయి