మూవీ: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
విడుదల తేదీ : 25-11- 2022
నటీనటులు: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్
దర్శకుడు : ఏఆర్ మోహన్
నిర్మాత: రాజేష్ దండా
సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకల
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తెలుగు రివ్యూ :
అల్లరి నరేష్ నాంది సినిమా తర్వాత తాను కొంచెం ఏమోసం ఉన్న కధలు ఎంచుకొంటూ పర్ఫెక్ట్ నటుడుగా ప్రూఫ్ చేసుకొంటున్నాడు అని చెప్పక తప్పదు. ప్రస్తుతం నరేష్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.
ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో మా 18 f రివ్యూ చదివి తెలుసుకుందామా !.
కధ (STORY) పరిశీలిస్తే:
గవర్నమెంట్ స్కూల్ తెలుగు టీచర్ శ్రీనివాస్ (Allari Naresh) ఎలక్షన్ డ్యూటీలో భాగంగా ఓ మారుమూల అడవి ప్రాంతం అయిన మారేడుపల్లి కి వెళ్తాడు. అప్పటికే ప్రభుత్వం పై కోపంతో రగిలిపోతున్న అక్కడ ప్రజలు శ్రీనివాస్ కి ఎదురు తిరుగుతారు.
ఈ సమస్యలో లక్ష్మి (Anandhi) టీచర్ శ్రీనివాస్ కి సాయంగా నిలబడుతుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్ పై మారేడుపల్లి ప్రజలకు నమ్మకం కుదురుతుంది.
అక్కడ ప్రజల సమస్యల్ని చూసి చలించిపోయిన శ్రీనివాస్ వారి తరఫున గవర్నమెంట్ తో పోరాడాలని నిర్ణయించుకుంటాడు.
మారేడుమిల్లి ప్రజానీకానికి కావాల్సిన కనీస సౌకర్యాల కోసం శ్రీనివాస్ ఏం చేశాడు?,
మారేడుమిల్లి ప్రజానీకం ప్రాధిమిక హక్కులను ఎలా సాధించాడు?,
ఆ ఊరి ప్రజానీకం శ్రీనివాస్ తో చేసిన పోరాటం ఏమిటి?,
టీచర్ శ్రీనివాస్ కి ఆనంది ఎందుకు సహాయం చేసింది?,
శ్రీనివాస్ – అనంది ప్రేమలో పడాతారా?
చివరకు గిరి పుత్రుల సమస్యలకు పరిస్కారం దొరికిందా ?
వంటి ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ గా ఉంటే మీ ఫ్యామిలీ తో కలస చూడవచ్చు, ఈ సినిమా కంటెంట్ దియేటర్ లో చూస్తేనే బాగుంటుంది, ఇంకా అడవి అందాలు పెద్ద తెర మీద అద్భుతంగా కనిపిస్తాయి.
కధ కథనం (SCREEN – PLAY) పరిశీలిస్తే:
దర్శకుడు ఏఆర్ మోహన్ గిరి పుత్రులపై జరుగుతున్న దారుణాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని (Screen-Play) రాసుకోలేదు అనిపిస్తుంది.
మారేడుమిల్లి ప్రజలకు ప్రభుత్వ అధికారులు మధ్యన వచ్చే ఘర్షణ సన్నివేశాలు సాగతీసినట్లుగా సినిమాటిక్ గా అనిపించాయి.
బాగా వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి సమస్యలను బాగానే రాసుకొని హైలైట్ చేసినప్పటికీ, ఆ సీన్స్ స్క్రీన్ పై ఎఫెక్టివ్ గా లేవు.
ఇలాంటి ప్రజా సమస్యల కధ లో నరేష్ – ఆనంది ప్రేమ సన్నివేశాలను ఇంకా బాగా న్యాచురల్ గా రాసి నటింపచేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు.
సినిమాలో ముఖ్యంగా అడవి నేపద్యం ఎక్కువుగా కనిపిస్తోంది. అయినా నేటివిటీ తాలూకు ఏమోసనల్ సీన్స్ మిస్ ఏయినట్టు న్యాచురలాటి తగ్గి సినిమాటిక్ గానే ఉన్నాయి.
దర్శకుడు ఏఆర్ మోహన్ కథనం బాగా స్లోగా సాగదీసి నట్టు అనిపించింది. ముఖ్యంగా రెండవ అంకం (సెకండ్ ఆఫ్) లో కొన్ని ల్యాగ్ సకన్నీవేశాలు ఇంకా కత్తిరించి ఉంటే బాగుండేది.
దర్నకుడి ప్రతిభ, నటుల నటన పరిశీలిస్తే:
చదువు కొనుక్కోనే స్తోమత లేని అమాయకత్వం తో గత 75 ఏళ్లుగా అన్యాయాలకి గురవుతున్న స్వచ్ఛమైన మనస్తత్వాలకు – ఏ సహాయం చేయలేని ప్రభుత్వ అధికారులకు మధ్య జరిగిన సంఘర్షణనే ఈ సినిమా కధ యొక్క సారాంశం.
ఈ అదునిక నాగరిక లోకంలో ఎక్కడో పట్టణాలకు దూరంగా అడవిలో జీవనం సాగిస్తున్న వెనుకబడిన ప్రజల నేపథ్యాన్ని తీసుకుని, ఆ నేపథ్యంలోనే పూర్తి అమాయకపు పాత్రలను రాసుకుని, వారి సమస్యల పై సినిమా తీసిన దర్శకుడు ఏఆర్ మోహన్ ను అభినందించకుండా ఉండలేము.
అల్లరి నరేష్ తెలుగు టీచర్ శ్రీనివాస్ పాత్రలో అద్భుతంగా నటించాడు. పాత్రకు తగ్గట్టు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో నరేష్ ఏమోసనల్ పెర్ఫార్మెన్స్ తో చాలా సహజంగా నటిస్తూ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలచారు.
హీరోయిన్ గా నటించిన మన తెలుగు అమ్మాయి ఆనంది తన గ్లామర్ తో పాటు, తన సహజ నటనతో ఆకట్టుకుంది. కలెక్టర్ గా సంపత్ రాజ్, ఇంగ్లీష్ టీచర్ గా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నారు.
మరి ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో వెన్నెల కిషోర్ తనదైన మ్యానరిజమ్స్ తో బాగానే నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.
సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:
దర్శకుడు ఏఆర్ మోహన్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. గిరిజన ప్రాంత ప్రజల జీవితాల్లోని సమస్యలను చూపించే ప్రయత్నం చేశారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.
రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. అడవి ప్రాంత ప్రజల జీవన విదానాన్ని తన కెమెరా లెన్స్ తో అందంగా చూపించారు.
సినిమాటోగ్రఫీ కి తగ్గట్టు ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ నిడివి ని కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది.
నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రియల్ ఫారెస్ట్ లొకేసన్స్ లోనే చిత్రీకరంచే ఏర్పాట్లు చేయడం వలన చాలా న్యాచురల్ గా ఉంది.
18FMovies టీం ఒపీనియన్ :
సోషల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రంలో కొన్ని సీన్స్ తో పాటు డీప్ ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ బాగున్నాయి కానీ, ఇంట్రస్టింగ్ గా సాగని స్క్రీన్ ప్లే తో పాటు, స్లో నేరేషన్ సినిమా ఫలిత్తాన్ని దెబ్బతీస్తుంది.
ఓవరాల్ గా ఈ సినిమా కొంత మంది ప్రేక్షకులను మాత్రమే మెప్పించగలదు. టైమ్ కుదిరితే దియేటర్ కి వెళ్ళండి లేకపోతే నాలుగు వారాలు ఆగితే మీ యిట్లో కుర్చీని మీకు నచ్చిన టైమ్ లో నచ్చిన సీన్స్ చూడవచ్చు.
18F MOVIES RATING: 2.75/5
- కృష్ణ ప్రగడ.