సుధీర్ “గాలోడు” వేస్ట్ ఫెలో అని తెలుసుకున్నాను ~ “గెహ్న సిపి” హీరోయిన్

092D5E4D 384A 49FE B732 74CD30403C07 e1669055312832

సుడిగాలి సుధీర్ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని
ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది.ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైలర్‌, పాటలకి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరోయిన్ గెహ్నా సిప్పి మీడియాతో ముచ్చటించారు.

నా ఫోటోలు, వీడియోలు చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెట్టారు. నేను ముంబైలో ఉండేదాన్ని. నా ఫోటోల ద్వారానే నాకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. ఇక్కడకు వచ్చి ఫోటో షూట్లు చేశాను. అలా నాకు ఈ గాలోడు సినిమా ఆఫర్ వచ్చింది.

10A53BA8 4624 4F85 A818 B9BF84147C37

గాలోడు అంటే మొదట్లో నాకు అర్థం తెలియదు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది. గాలోడు అంటే వేస్ట్ ఫెల్లో అని మా డైరెక్టర్ చెప్పారు. నేను ఇందులో నేను ఓ అమ్మకూచి, నాన్నకూచిలాంటి పాత్రను పోషించాను. కాలేజ్ గర్ల్‌, క్యూట్ గర్ల్‌గా కనిపిస్తాను.

కరోనా సమయంలో ఎంతో కష్టపడి ఈ సినిమాను షూట్ చేశాం. నేను ఈ సినిమాకు దగ్గరదగ్గరగా 25 రోజులు పని చేశాం. నాకు డైలాగ్స్ చెప్పడంలో అంతగా ఇబ్బంది అనిపించలేదు. సెట్‌లో అందరూ తెలుగులోనే మాట్లాడేవారు. నాకు అలా అలవాటైంది. లఢఖ్‌లో షూటింగ్‌ కాస్త కఠినంగా అనిపించింది. అక్కడ ఆక్సిజన్ లెవెల్‌ కూడా తక్కువగా ఉండేది.

ఇది నా రెండో చిత్రం. నాకు రాబోయే అవకాశాల గురించి ఎక్కువగా ఆశించడం లేదు. ఈ సినిమాపై ఎంతో పాజిటివ్‌గా ఉన్నాను. నేను తెలుగు సినిమాలు చేస్తుంటాను. సెట్‌లో అందరూ తెలుగులోనే మాట్లాడేవారు. అందుకే నాకు తెలుగు డైలాగ్స్ చెప్పడం ఈజీగా మారింది. డైలాగ్స్ పరంగా నేను ఎక్కువగా ప్రిపేర్ అయ్యేదాన్ని. డబ్బింగ్ మాత్రం నేను చెప్పలేదు.

250CBBD3 4D5D 4614 BB19 01C962553554

సుధీర్ ఎక్కువగా సిగ్గుపడుతుంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి. అందరూ కంఫర్టబుల్‌గా ఉండేట్టు చూసుకుంటారు. సీన్స్ గురించి, డైలాగ్స్ గురించి చర్చిస్తుంటారు. షూటింగ్‌ కంటే ముందు.. జబర్దస్త్ షోను, సుధీర్ స్కిట్లు చూశాను.

నటిగా నేను ఎంతో ఇంప్రూవ్ అయ్యాను. ఇలానే ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. నా జర్నీలో ఏది వస్తే దాన్ని స్వీకరిస్తూ వెళ్తాను. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. నాకు అది సహజంగానే వచ్చింది.

252912CB 9A1C 4AE4 8C27 23E7F705103A

టౌన్ అండ్ కాలేజ్ గర్ల్, మాస్ అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టోరీనే గాలోడు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది.. దాని తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది కథ.

మంచి దర్శకులు, నిర్మాతలతో పని చేయాలని అనుకుంటున్నాను. మంచి కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నాను. గ్లామర్‌గా కనిపించడమే కాదు.. నటిగా మంచి పాత్రలు కూడా చేయాలని ఉంది. గాలోడు పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది.

8CD99CE1 C570 44B6 8533 938B07EDF801

నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో ఐదు పాటలుంటాయి. నేను మూడు పాటల్లో కనిపిస్తాను. ప్రతీ సినిమాకు మ్యూజిక్ ప్రాణంగా నిలుస్తుంది. ఈ చిత్రంలోనూ పాటలు బాగుంటాయి. పాటలు బాగుంటే నేను పాడతాను.

ముందు స్క్రిప్ట్ బాగుంటేనే నేను కథకు ఓకే చెబుతాను. ఆ తరువాతే టీం గురించి ఆలోచిస్తాను. కానీ ఓ సినిమాకు ఆ రెండూ ముఖ్యమే.

డైరెక్టర్ రాజ శేఖర్ గారు ఎంతో కామ్‌గా ఉంటారు. ఎప్పుడూ కోప్పడటం కూడా చూడలేదు. ఎంతో కామ్‌గా ఉంటూ పని చేసేవారు. నిర్మాత గారు మమ్మల్ని ఎంతో కంఫర్ట్‌గా చూసుకున్నారు.

FB5D24FB 284D 4639 BF41 F9C62F480AA4

నేను ముంబైలో పుట్టి పెరిగాను. బీకాం చదివాను. ఎక్కువగా కాలేజ్‌కు వెళ్లేదాన్ని కాదు. నా ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే ఉండేది. ఇంట్లో వాళ్లు కూడా ఎక్కువగా చదవమని ఒత్తిడి చేసేవాళ్లు కాదు.

కరోనా కంటే ముందు నేను ఎక్కువగా తెలుగు సినిమాలు చూశాను. మహానటి, గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, ఆకాశమంత ఇలా ఎన్నో సినిమాలు చూశాను. తెలుగు సినిమాల్లో నటించాలని అనుకున్నాను. హైద్రాబాద్‌ ఫుడ్ అంటే నాకు ఇష్టం. ఎంతో స్పైసీగా ఉంటుంది.

శేఖర్ కమ్ముల గారితో పని చేయాలని ఉంది. ఆయన తీసిన ఫిదా సినిమా అంటే నాకు చాలా ఇష్టం. లవ్ స్టోరీలంటే నాకు చాలా ఇష్టం. సుకుమార్ గారంటే నాకు చాలా ఇష్టం.

హీరోల్లో ధనుష్ సర్ అంటే చాలా ఇష్టం. నాగ చైతన్య, రామ్ చరణ్‌లంటే చాలా ఇష్టం. నాని భలే భలే మగాడివోయ్, నితిన్ ఇష్క్ సినిమా ఇలా నాకు చాలా ఇష్టం. నాకు తెలుగు సినిమాలన్నా, మాస్ స్టెప్పులన్నా, ఐటం సాంగ్స్ అన్నా చాలా ఇష్టం.

నేను ఈ సినిమా మీద ఎంతో పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. కరోనా సమయంలో ఎంతో కష్టపడి పని చేశాం. కానీ ఫలితాన్ని దేవుడికి వదిలేస్తున్నాను. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.

డీసెంట్‌గా ఉండే ఐటం సాంగ్స్‌ చేస్తాను. వాసివాడి తస్సాదియ్యా, మ మ మహేష వంటి పాటలు నాకు ఇష్టం. అలాంటి వాటిలో చేస్తాను. నాకు తెలుగు మ్యూజిక్, బీట్స్ అంటే ఇష్టం.

2DDC2D4C CC85 4211 855C B6C4E8BD13AA

నేను డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాను. కానీ నా యాస, భాష సెట్ అవుతుందో లేదో అని దర్శకులు చెప్పాలి.

టీం ఎంతో కష్టపడి గాలోడు సినిమాను చేశాం. అందరి కష్టం ఇందులో ఉంది. రిలీజ్‌కు టైం దగ్గరపడుతోంది. నవంబర్ 18న రాబోతోంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *