హీరో కిరణ్ అబ్బవరం “క” సినిమా తెలుగు రైట్స్  వంశీ నందిపాటి ఎంతకు కొన్నారంటే !

IMG 20240725 WA0218 scaled e1721920661481

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” తెలుగు స్టేట్స్ రైట్స్ సొంతం చేసుకున్నారు సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి. ఆయన ఈ సినిమాను 12 కోట్ల రూపాయలకు ఎన్ఆర్ఐ బేసిస్ లో హక్కులు తీసుకున్నారు.

ఈ సినిమా ఇతర భాషల థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ దాదాపు 18 కోట్ల రూపాయల దగ్గర క్లోజ్ అయ్యేలా ఉంది. దీంతో 30 కోట్ల రూపాయలపైనే “క” సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.

IMG 20240725 WA0216

“క” సినిమా పట్ల ట్రేడ్ సర్కిల్స్ లో ఏర్పడిన క్రేజ్ కు ఈ డీల్ నెంబర్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తోంది. “క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

నటీనటులు –

కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

టెక్నికల్ టీమ్:

ఎడిటర్ – శ్రీ వరప్రసాద్, డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం, మ్యూజిక్ – సామ్ సీఎస్, ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్, లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్, సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్), కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల, మేకప్ – కొవ్వాడ రామకృష్ణ, ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్, కొరియోగ్రఫీ – పొలాకి విజయ్, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరికో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి, ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), రచన దర్శకత్వం – సుజీత్, సందీప్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *