సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘ఎక్స్’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు.
Happy to launch this fiery and intriguing first look of @CreationSridevi & @winvitaa Presents Production No.1 #PadamatiKondallo 🤗
Wishing everyone involved all the very best and good luck.#SriDevi #KannanMuniswamy @addictiontwit @ActorKatari @ShraavyaReddy… pic.twitter.com/o36wMkVMrn
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 22, 2024
అనురోప్ కటారి హీరో గా నటిస్తున్న ఈ ‘పడమటి కొండల్లో’ పోస్టర్ లో తన లుక్, గెటప్ చాలా గంభీరంగా ఉన్నాయి, హీరో రౌద్ర రస హావభావాలతో రక్తం అంటిన కత్తి పట్టుకుని నడుస్తున్న పోస్ అది, పెద్ద విద్వంసం జరిగిన ప్రదేశంలో, సినిమాలో ఫైట్ సీన్ లో లుక్ లా ఉంది.

దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ “పడమటి కొండల్లో” సినిమాతో సరి కొత్త ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులు పొందుతారని, ఈ చిత్రానికి ఒక మార్క్ ఉంటుంది అని, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కొనసాగే ఈ చిత్రంలో వుండే ప్రేమకథ ఎంతో ఆసక్తికరంగా వుంటుందని, సినిమా మొత్తం ఒక డిఫరెంట్ అండ్ విజువల్ ఫీస్ట్‌లా వుండేలా ప్రదేశంలో చిత్రీకరణ జరుపుతామని, భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపారు.
తారాగణం:
అనురుప్ప్ కటారి, యశస్వి శ్రీనివాస్, శ్రావ్య రెడ్డి, మురళీ కృష్ణం రాజు, లతీష్ జవ్వాది, మురళీ రాజు, స్కయ్, జగదీష్ రెడ్డి, ఆర్.రాము, శివాని నీలకంఠం, భాను, ప్రసాద్,రాంబాబు,లక్కీ,
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు/సంగీతం: నరేష్ పెంట, నిర్మాత: జయకృష్ణ దురుగడ్డ, సినిమాటోగ్రఫీ: కన్నన్ మునిసామి, ఎడిటర్: బల్లా సత్య నారాయణ, స్టంట్స్: శ్రీను, సాహిత్యం: సాహిత్య సాగర్, డైలాగ్స్: ఆర్.రాము, కళ: శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లతీష్ జవ్వాది, కో-డైరెక్టర్: హర్ష.కె, పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు.