ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా, గుంటూరు ఏరియాతో పాటు ఆంధ్రా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లోని సినిమా థియేటర్ల యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని, తద్వారా డిజిటల్ ప్రొవైడర్లకు (UFO, Qube) ఛార్జీలు. చెల్లించలేకపోతున్నారని కారణాన్ని చూపుతూ తమ సినిమా థియేటర్లను మూసివేసినట్లు మా దృష్టికి వచ్చింది.
అదే విధంగా తెలంగాణలో కూడా కొన్ని సినిమా థియేటర్ల యజమానులు తమ ఇష్టానుసారం తమ థియేటర్లను ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శన రద్దు చేయడమైనది అని పెట్టేవారు. ఇది ప్రధానంగా ఎన్నికలు మరియు IPL కారణంగా ప్రేక్షకులు దియేటర్స్ కి రావడం తగ్గింది, తద్వారా ఆదాయాల పై ప్రభావం పడుతుంది.
ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలియజేస్తున్నాము.
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మరియు ప్రింట్ మీడియాలో సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నుండి ఏ గ్రూప్ గాని సినిమా థియేటర్ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్ నుండి గాని అపెక్స్ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని మేము పునరుద్ఘాటిస్తున్నాము.
సినిమా హాళ్లు బంద్ అనేది తక్కువ వసూళ్లు రావడంతో కొందరు థియేటర్ యజమానులు తీసుకొన్న వ్యక్తిగత నిర్ణయం. దీనికి సంబంధించి, పైన పేర్కొన్న అన్ని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేయబడింది.
మా సంస్థలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తాయి.
ఇదీ, తెలుగు సిని పరిశ్రమలో అచ్యున్నత సంస్ధ లు నిన్న మీడియా సంస్ద లకు విడుదల చేసిన సమాచారం. కాని ఈ సంస్థలు ఉన్నది ఎందుకు, ఎవరి ఉన్నతి కి శ్రమిస్తున్నాయి అని కొంతమంది దియేటర్ యజమానులు ప్రశ్నిస్తున్నారు.
మా 18F మూవీస్ రిపోర్టర్ గ్రౌండ్ రిపోర్ట్ కోసం హైదరాబాద్, నిజామాబాద్ లోని కొన్ని సింగిల్ స్క్రీన్ దియేటర్ యజమానులను ప్రత్యక్షంగా కలవడం జరిగింది.
వారు చెప్పిన వివరాలు ఏంటంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నీ బడా బాబులు నైజాం లోనీ 70% ధియేటర్స్ తమ ఆధీనం లో ( కొనడం, దీర్ఘకాలం లీజు) ఉంచుకొని వారి హళ్లలోనే కొత్త కంటెంట్ రిలీజ్ చేసుకొంటున్నారు.
మాలాంటి సింగిల్ స్క్రీన్ దియేటర్ యజమానులను బలవంతం చేసి లీజు కి ఇమ్మంటున్నారు లేకపోతే కంటెంట్ ఇవ్వడం లేదు. మమ్ములను, మా ధియేటర్స్ నీ బలవంతంగా చంపేస్తున్నారు.
ఇవన్నీ తెలిసిన ఛాంబర్, కౌన్సిల్ కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పడం ఏమిటి. మా 24 క్రాఫ్టుల సంక్షేమం కోసం ఏర్పడిన సంస్ధ లు సమస్య మాది మాత్రమే అని దియేటర్ యజమానుల మిద వదిలేయడం ఎంత వరకూ కరెక్ట్ అనీ అడుగుతున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం, తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు వాస్తవ సమచారం అందిస్తూ ఉంటాము..
* కృష్ణ ప్రగడ.