యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “తల్వార్” పూజ! 

IMG 20240819 WA0214 e1724063792933

యంగ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “తల్వార్” ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు.

ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన తల్వార్ సినిమా ప్రారంభోత్సవంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతిథిలుగా పాల్గొన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు.

IMG 20240819 WA0217

డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించబోతున్నారు. వారి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు –

ఆకాష్ జగన్నాథ్, తదితరులు

టెక్నికల్ టీమ్: 

ఆర్ట్ డైరెక్టర్ – విఠల్, ఎడిటర్ – ఐల శ్రీనివాసరావు, సినిమాటోగ్రఫీ – త్రిలోక్ సిద్ధు, మ్యూజిక్ డైరెక్టర్ – కేశవ కిరణ్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), డిజిటల్ పార్టనర్ – ఎస్ జే మీడియాస్పాట్, ప్రొడ్యూసర్ – భాస్కర్ ఇ.ఎల్.వి, డైరెక్టర్ – కాశీ పరశురామ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *