హీరో నితిన్ యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాబిన్హుడ్‘. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2 పాటలు, 6 రోజుల టాకీ షూట్ మాత్రమే పెండింగ్ వుంది.
ఈ రోజు నితిన్, శ్రీలీల, డైరెక్టర్ వెంకీ కుడుముల వున్న వర్కింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఎంటర్ టైనింగ్ అడ్వంచర్ ‘రాబిన్హుడ్’ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. నవంబర్ మొదటి వారంలో టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు.
టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు:
నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు..
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల, బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సిఈవో: చెర్రీ, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీవోపీ: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల, లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, పీఆర్వో: వంశీ-శేఖర్.