దాసరి ఫిల్మ్ అవార్డ్ అందుకున్న సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ !

IMG 20240507 WA0151 e1715075444203

 ప్రేక్షకుల టేస్ట్ కు నచ్చేలా వైవిధ్యమైన కథలతో సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటున్నారు ఎస్ కేఎన్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా సాయి రాజేశ్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఆయన నిర్మించిన “బేబి” సినిమా గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాకు గానూ ‘బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్’గా దాసరి ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు ఎస్ కేఎన్. ఆయన గురువులా భావించే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం విశేషం.

లాస్ట్ ఇయర్ చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయం సాధించింది “బేబి“. రా అండ్ రస్టిక్, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో ప్రేమకథతో సక్సెస్ అందుకోవడం “బేబి” సినిమా ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.

తెలుగులో 100 కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలిచిన బేబి…మొత్తం సౌత్ లో సూపర్ సక్సెస్ అందుకుంది. కల్ట్ బొమ్మగా బేబి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో బేబి రీమేక్ అవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *