జ్యోతి పూర్వజ్,  పూర్వాజ్ లా “కిల్లర్” మూవీ  అప్ డేట్! 

IMG 20241006 WA0150 e1728211846431

పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాలు లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్. ఆమె ప్రధాన పాత్రలో “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని అనౌన్స్ చేశారు. ఈ రోజు “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ లాంఛ్ చేశారు మేకర్స్.

పవర్ ఫుల్ లేడీ, గన్, చెస్ కాయిన్స్ తో ఆల్ట్రా మోడరన్ గా డిజైన చేసిన “కిల్లర్” మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్. ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. పూర్వాజ్ “కిల్లర్” చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.

నటీనటులు-

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్. అదర్ లీడ్ కాస్ట్ డిటేల్స్ త్వరలో ప్రకటిస్తారు.

టెక్నికల్ టీమ్:

సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి, మ్యూజిక్ – అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నంవీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ – మెర్జ్ ఎక్స్ఆర్పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), బ్యానర్స్ – థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్,రచన దర్శకత్వం – పూర్వాజ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *