‘జ్యువెల్ థీఫ్’ మూవీ టీజర్ లాంచ్ చేసిన 30 ఇయర్స్ పృధ్వీ !

IMG 20240817 WA0226 e1724046328221

కృష్ణసాయి – మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘జ్యువెల్ థీఫ్‘ .శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు న‌టించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు. ఈ సందర్భంగా

IMG 20240817 WA0225

30 ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ… హీరోగా కృష్ణసాయి ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. ఆయన యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ మూవీలో నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

నేను, కృష్ణసాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గ‌తంలోనే కృష్ణ‌సాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. నిజ జీవితంలోనూ రియల్ హీరో కృష్ణ సాయి. అని చెప్పుకొచ్చారు.

IMG 20240817 WA0220

హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ… నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాను. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒక‌ప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో క‌లిసి న‌టించాల‌న్న నా కల ఈ సినిమాతో నెరవేరింది.

IMG 20240817 WA0223

ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ… కృష్ణ సాయికి తగ్గ కథ ఇది. సినిమా నటీనటులు, చిత్ర యూనిట్ అందరు బాగా చేశారు. ఇది చిన్న సినిమా కాదు, పేరున్న సీనియర్ నటీనటులు ఇందులో ఉన్నారు. అంద‌రిని ఆక‌ట్టుకునే సినిమా ఇది. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు.

హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ : మంచి కాన్సెప్ట్ తో రూపోందిన ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో నటించిన అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఙతలు అన్నారు…

నటీనటులు:

హీరో కృష్ణసాయి, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, సీనియర్ కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్, నటీమణులు రాగిణి, హీరోయిన్ నేహా దేశపాండే , ఆనంద చక్రపాణి, జెన్నీ, మేక రామ కృష్ణ, వైజాగ్ జగదీశ్వరి, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, అప్పాజి, కాట్రగడ్డ సుధాకర్, జంగారెడ్డి, వెంకట రమణారెడ్డి, శ్రావణి, శ్వేత రెడ్డి తదితరులు.

సాంకేతిక వర్గం:

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పీఎస్ నారాయణ, డీవోపీ: అడుసుమిల్లి విజయ్ కుమార్, ఎడిటర్ : జేపీ, ఫైట్ మాస్టర్: రమణ డాన్స్: స్వర్ణ, యాని, లిరిక్ : కామేశ్వర్, పీఎస్ నారాయణ, మ్యూజిక్: ఎంఎం శ్రీలేఖ,  ఆడియో: ఆదిత్య మ్యూజిక్, ఆర్ట్ డైరెక్టర్ కె.మురళీధర్,పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *