జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ! ఏప్పుడంటే?

IMG 20240422 WA0165 e1713784274715

భారతీయ సినిమా, ప్రపంచ సినిమా ఖ్యాతిని చాటడానికి, ,ప్రోత్సహించడానికి ఫిలిం ఫెస్టివల్స్ ను రెగ్యులర్ గా నిర్వహిస్తూ, ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ.

గత 16 ఏళ్లుగా ఇండియన్ సినిమా, ప్రపంచ సినిమా వికాసానికి ఎంతో కృషి చేసిన ఈ సంస్థ నిన్నటి, నేటి, రేపటి సినిమా గురించి

ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ పేరుతో ఈ నెల 25వ తేదీ (గురువారం) హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్ , స్క్రీన్ నెంబర్ 5లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించబోతోంది.

ఈ విషయాన్ని జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ చైర్మన్ హనురోస్ తెలిపారు. ప్రసాద్ మల్టీఫ్లెక్స్ సౌజన్యంతో, వారి వేదికపైన జరగబోయే ఈ కార్యక్రమంలో ప్రసాద్ గ్రూప్స్ చైర్మన్ శ్రీ రమేష్ ప్రసాద్ గారు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, రామోజీ ఫిలిం సిటీ సీఈఓ శేష సాయి, ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్, ఇంకా పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు హను రోస్ వెల్లడించారు.

తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమాలకు సంబంధించిన ప్రపంచ సినిమా గురించి వక్తలు మాట్లాడతారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *