కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీం సందడి! అతిథుల్ని ఆకట్టుకున్న ‘కన్నప్ప’ టీజర్

kannappa team in Cranes e1716289896740

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ తెర మీదకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది. రీసెంట్‌గానే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మీద కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఆపై ప్రభాస్ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కేన్స్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీం సందడి చేసింది. మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభుదేవా వంటి వారు కన్నప్ప కోసం కేన్స్ ఫెస్టివల్‌కు వెళ్లారు.

kannappa team at Canes

ఇక అక్కడే కన్నప్ప టీజర్‌ను అందరికీ పరిచయం చేశారు. కన్నప్ప టీజర్‌కు అక్కడి వారంతా ముగ్దులయ్యారు. ఇక కన్పప్ప టీజర్‌ను ఇండియన్ ప్రేక్షకులకు చూపించేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. జూన్ 13న ఇండియా వైడ్‌గా కన్నప్ప టీజర్ విడుదల కానుంది. కానీ అంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు కన్నప్ప టీజర్‌ను చూపించబోతున్నారు. మే 30న తెలుగులో కన్నప్ప టీజర్‌ను ముందుగా రిలీజ్ చేస్తామని విష్ణు మంచు ప్రకటించారు.

ఈ మేరకు విష్ణు మంచు ఓ ట్వీట్ వేశారు. ‘కేన్స్‌లో మా కన్నప్ప టీజర్‌ను అందరికీ చూపించాం. టీజర్‌ను చూసి అందరూ ప్రశంసించారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లు, అక్కడికి వచ్చిన ఇండియన్స్ కన్నప్ప టీజర్‌ను చూసి ముగ్దులయ్యారు. ఆ రెస్పాన్స్ చూసిన తరువాత నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. మన ఇండియన్ ప్రేక్షకులకు జూన్ 13న టీజర్ చూపించబోతున్నాం.

kannappa team at Canes 2

మే 30న తెలుగు టీజర్ ను హైద్రాబాద్‌లోని పాపులర్ థియేటర్‌లో ప్రదర్శించనున్నాం. మా కన్నప్పను సోషల్ మీడియాలో మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న కొంత మంది సెలెక్టెడ్ ఆడియెన్స్‌కు ఆ టీజర్‌ను చూపిస్తాం. మా టీం వారిని సెలెక్ట్ చేస్తుంది. కన్నప్ప టీజర్‌ను అందరికీ చూపించాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామ’ని అన్నారు.

అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *