ఎర్ర గులాబి ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

IMG 20250322 WA0231 e1742657241346

శ్రేయసి షా ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకం పైన, మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా ఎర్ర గులాబి.

ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను ప్రముఖ డైనమిక్ యువ నిర్మాత  యస్ కె యన్ ఈరోజు లాంచ్ చేశారు. “ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుందని, బాగా ఆడాలని ఆశిస్తున్నాను” అంటూ, యువన్ సూర్య ఫిలిమ్స్ టీమ్‌కు అభినందనలు తెలిపారు.

IMG 20250322 WA0233

నేటి సమాజంలోని పలు సున్నితమైన అంశాల్లో – ఈతరం యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే నేపథ్యంతో నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా “ఎర్ర గులాబి” పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో యువతరాన్ని హుషారెత్తించే ఒక తెలంగాణ ఫోక్ సాంగ్‌, ఇంగ్లిష్ సాంగ్‌తో కలిపి మొత్తం 3 వైవిధ్యమైన పాటలున్నాయి. లేడీ “యానిమల్”ను తలపించేలా మంచి యాక్షన్ సన్నివేశాలున్నాయి.

IMG 20250322 WA0235

ఎప్పట్లాగే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, నంది అవార్డు రచయిత-దర్శకుడు మనోహర్ చిమ్మని, ఈ సినిమాలో కూడా చాలామంది కొత్త నటీనటులకు, టెక్నీషియన్లకు అవకాశమిచ్చారు. శ్రేయసి షా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో – నరేంద్ర, వెంకట్, సోమయాజి, షబీనా, మిల్కీ, యాంకర్ అను, విజయేంద్ర మొదలైనవాళ్ళు నటించారు.

ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో జబర్దస్త్ వీరబాబు నటించాడు. ప్రముఖ అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ ఈ సినిమాలో ఒక సెన్సేషనల్ రోల్‌లో నటించడం విశేషం.

మనూటైమ్ మూవీ మిషన్ సమర్పణలో రూపొందుతున్న ఈ “ఎర్ర గులాబి” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో పూర్తవుతున్నాయి. అనంతరం సినిమా రిలీజ్ ఉంటుంది.

 టెక్నికల్ టీమ్: 

మ్యూజిక్: శ్రీవెంకట్  , డాన్స్: సునీల్ , ఫైట్స్: రాజేష్, ఎడిటర్: హేమంత్ నాగ్, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: లహరి జితేందర్ రెడ్డి, కెమెరా: వీరేంద్ర లలిత్ , నిర్మాత: యువన్ శేఖర్ , రచయిత-దర్శకుడు: మనోహర్ చిమ్మని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *