ఎన్టీఆర్ శ్రీను సమర్పిస్తున్న క్యూ జి సినిమాని తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ ఎవరివంటే! 

IMG 20240817 WA0234 e1723897656271

జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్ పై వివేక్ కుమార్ కన్నన్ నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా క్యు జి. మరో నిర్మాతగా గాయత్రి సురేష్ వ్యవహరించారు.

ఎంతో హై కాంపిటీషన్లో ఈ సినిమా తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకొని నిర్మాత ఎం. వేణుగోపాల్ గారు రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. భారీ క్యాస్టింగ్ తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది.

IMG 20240817 WA0235

ఈ సందర్భంగా నిర్మాత ఎం. వేణుగోపాల్ గారు మాట్లాడుతూ : ఎంతో హెవీ కాంపిటీషన్లో కూడా ఈ సినిమా తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ నాకు ఇచ్చినందుకు తమిళ నిర్మాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అతి త్వరలో సినిమాని మా మూడు సంస్థల ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

IMG 20240817 WA0237

నటీనటులు : 

జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా అర్జున్.

టెక్నీషియన్స్ :

బ్యానర్ : రుషికేశ్వర్ ఫిలిమ్స్, ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్, నిర్మాతలు : ఎం. వేణుగోపాల్, వివేక్ కుమార్ కన్నన్, గాయత్రి సురేష్, డి ఓ పి : అరుణ్ బాత్మనబన్, మ్యూజిక్ : డ్రమ్స్ శివమణి, ఎడిటర్ : కె.జె. వెంకటరమణన్, దర్శకత్వం : వివేక్ కుమార్ కన్నన్, డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణంపి ఆర్ ఓ : మధు VR.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *