ఆహా ఓటిటీ లో ప్రేక్షక ఆదరణ పొందుతున్న ‘ది బర్త్‌డే బాయ్’ మూవీ ! 

IMG 20240811 WA0123 scaled e1723375224917

కొత్త కథలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు.  మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ది బర్త్ డే బాయ్ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కింది.

ఓ ఐదుగురు స్నేహితుల చుట్టూ జరిగే ఈ కథకు జనాలు ఫిదా అయ్యారు. థియేటర్లో ఈ సినిమాకు మంచి విజయమే దక్కింది. ఇక ఇప్పుడు ఆహాలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది.

ఐ భరత్ నిర్మించిన ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న ఈ చిత్రాన్ని బిగ్ ఫిష్ సంస్థ ఆహాలోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు ఆహాలోనూ ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది.

IMG 20240811 WA0124

ఓటీటీ ఆడియెన్స్ సైతం ది బర్త్ డే బాయ్ సినిమాను చూసి ఫిదా అవుతున్నారు. అన్ని రకాల అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ మూవీకి ఇప్పుడు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది.

ప్రశాంత్ శ్రీనివాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. కథలోని టెన్షన్, ఎమోషన్‌ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేసింది. సంకీర్త్ రాహుల్ విజువల్స్, కెమెరా పనితనం మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది.

IMG 20240811 WA0126

తారాగణం:

రవికృష్ణ, సమీర్ మల్ల, రాజీవ్ కనకాల.

సాంకేతిక బృందం:

డైరెక్టర్ : విస్కీ, ప్రొడ్యూసర్: ఐ భరత్, డిఓపి: సంకీర్త్ రాహుల్, మ్యూజిక్ డైరెక్టర్ :ప్రశాంత్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ : ఏఆర్ వంశీ జి , ఎడిటర్ :నరేష్ అడుప , సింక్ & సౌండ్ డిజైన్ :సాయి మనీంధర్ రెడ్డి ,సౌండ్ మిక్సింగ్ :అరవింద్ మీనన్ ,కలర్ గ్రేడింగ్ :మేటిన్ ఒకట , మేకప్ చీఫ్:వెంకట్ రెడ్డి , పబ్లిసిటీ డిజైనర్:ఓంకార్ కడియం , డిజిటల్ మార్కెటింగ్ :బిగ్ ఫిష్ మీడియాస్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *