చందనా కొప్పిశెట్టి సహకారం తో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ కర్తుర్వార్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నటుడు – అజయ్ కుమార్, బిగ్ బాస్ తెలుగు భాను శ్రీ మరియు రోడీస్ విజేత శ్వేతా మెహతా ప్రముఖ పాత్రల్లో నటించారు. ప్రాచీ ఠాకేర్, అభయ్ బేతిగంటి, జయశ్రీ గారు మరియు యాదమ రాజు వంటి ఇతర ప్రతిభావంతులైన నటులు కూడా ఉన్నారు.
ఇది అజయ్ కి దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా అయినా కమర్షియల్ గా ఎక్కడ తక్కువ కాకుండా యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్, డీసెంట్ ఫిలిం ఎగ్జిక్యూషన్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడ తక్కువ కాకుండా నిర్మించిన చిత్రం. ఆడియన్స్ నుంచి చాలా మంచి స్పందన వస్తూ ZEE 5 లో ట్రెండింగ్ లో నిలుస్తోంది అజయ్ గాడు సినిమా.
‘అజయ్ గాడు’ ఒక మధ్య తరగతి కుర్రాడు అజయ్ డబ్బు, కీర్తి మరియు ప్రేమ కోసం ప్రయత్నించి కథ. ఏమీ చేయలేని స్థితిలో తనను తాను కోల్పోయిన అజయ్ డ్రగ్ ఎడిక్టేడ్ మెడికో అయిన శ్వేతా నుంచి మళ్లీ ఇన్స్పైర్ అవుతాడు. ఈ చిత్రం అజయ్ తన అంతర్గత సమస్యలను ఎదుర్కొంటూ, బాహ్య ప్రపంచం అందించే సవాళ్లతో పోరాడుతూ, తనను తాను ఎలా కొత్తగా ఆవిష్కరించుకున్నాడు అనే కథనం ప్రధానాంశంగా తీసిన చిత్రం.
సినిమా సక్సెస్ పై ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, అజయ్ కర్తుర్వార్ ఇలా అన్నాడు,’అజయ్ గాడు’ కోసం నటుడు, నిర్మాత మరియు దర్శకుడి బాధ్యతలు చేపట్టడం చాలా థ్రిల్లింగ్ జర్నీ. ఈ ప్రాజెక్ట్ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ZEE 5 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి చాలా మంచి స్పందన లభిస్తోంది. ZEE5తో ఈ సహకారం గేమ్ ఛేంజర్ అని నేను నమ్ముతున్నాను. ‘అజయ్ గాడు’ అనేది ప్రతి ఒక్కరికీ, ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒకచోట కనెక్ట్ అయ్యే సినిమా.
ఈ చిత్రంలో నల్లమల్ల లో ప్రధాన పాత్ర పోషించిన నటి భాను శ్రీ మాట్లాడుతూ.. , “అజయ్ కర్తుర్వార్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకమైన పాత్రలు మరియు ఆకట్టుకునే స్క్రిప్ట్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అతని కథ కథనం ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం. తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా జీవించే పాత్రలో నటించాను. ఇది నా పాత్ర మరియు అజయ్ పాత్రల మధ్య బోల్డ్ రిలేషన్‌షిప్‌తో సాగే అందమైన ప్రేమకథ.
ఇప్పుడు ZEE5లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.