YRF SPY Universe TIGER3 update: యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ మూవీ ‘టైగర్ 3 లో ఆన్ని ఫైట్స్ ఉన్నాయా! 

IMG 20231108 WA0045 e1699424986332

 

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అత్యధిక యాక్షన్ సీక్వెన్సులున్న చిత్రంగా సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది.

IMG 20231108 WA0046

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనీష్ శర్మ మాట్లాడుతూ ‘‘‘టైగర్ 3’లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బిగ్గెస్ట్ యాక్షన్ పెయిర్ టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్, జోయా పాత్రలో కత్రినా కైఫ్ నటించారు. ఇది వారిద్దరి కథ. వారిద్దరూ కలిసినప్పుడు సంఘర్షణ ఉంటూనే వస్తుంది. వారి మధ్య బంధం పెరిగే కొద్ది ఈ సంఘర్షణ పెరిగిందే కానీ తగ్గలేదు.

IMG 20231108 WA0044

టైగర్ 3లో ఈ సంఘర్షణ ఇంకా బలంగా కనిపించనుంది. అందుకు తగినట్లు యాక్షన్ సన్నివేశాలు మెప్పించనున్నాయి. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ధీటుగా టైగర్ 3లో సన్నివేశాలు మెప్పించనున్నాయి. సినిమాలో సల్మాన్, కత్రినా పాత్రలు ఎదుర్కొనే సమస్యల్లో ఉండే తీవ్రత వల్ల సినిమా చాలా వేగవంతంగా సాగుతుంది.

IMG 20231108 WA0047

ఈ మూవీలో 12 అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఇవి ప్రేక్షకులు సీట్ ఎడ్జ్‌లో కూర్చొనిపెట్టి చూసేలా చేేస్తాయి. ఇక అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది. టైగర్, జోయా ఫ్యాన్స్‌కైతే ఇదొక ట్రీట్‌లా ఉంటుంది. ఐమ్యాక్స్‌లో ఈ యాక్షన్ సీన్స్‌ అబ్బురపరుస్తాయి’’ అన్నారు.

 

యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న టైగర్ 3.. నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *