టాలీవుడ్ లోకి యువ నటులకు ప్రోత్సాహం: తెలుగు సినీ స్క్రీన్ కి సరికొత్త యంగ్ విలన్ ప్రీత్ షేర్ గిల్. 

preet gill artist స్టిల్స్ 6 e1672803475930

 

సినిమా పరిధి ఇప్పుడు బాగా పెరిగిపోయింది. తెలుగు సినిమా.. ఇప్పుడు ఇండియన్ సినిమాగా ఎదిగింది. దీంతో పలు భాషల నటీనటులు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం పొందాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.

preet gill artist స్టిల్స్

ఆ కోవలో తెలుగు సినిమాల్లో నటుడుగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు పంజాబీ పోరడు ప్రీత్ షేర్ గిల్. పంజాబ్ యూనివర్సిటీ నుండి థియేటర్ ఆర్ట్స్ లో ఎంఏ పట్టా పుచ్చుకున్న ప్రీత్ షేర్ గిల్ – వార్నింగ్, ఎక్కో మీక్కే, నిడర్, ఖిడారి అనే నాలుగు పంజాబీ సినిమాల్లో యంగ్ విలన్ పాత్రలలో నటించాడు.

preet gill artist స్టిల్స్ 4

అంతేకాక రంగస్థలం మీద 25 పంజాబీ నాటికలు, నాటకాల్లో నటించి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో జాతీయ స్థాయిలో రెండు మెడల్స్ సంపాదించిన.. ఈ చండీఘడ్ చిన్నోడికి కరాటే లో కూడా ప్రవేశం ఉంది.

preet gill artist స్టిల్స్ 2

ఇలా నటనలోనూ, ఫైట్స్ లోచక్కని శిక్షణ పొంది.. తనకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రీత్.
ప్రస్తుతం మదర్ ల్యాండ్ అనే వెబ్ సిరీస్లో, ఒక హిందీ సినిమాలో నటిస్తున్న ప్రీత్ గిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హైదరాబాద్ తెలుగు సినిమా రంగానికి వచ్చాడు.

preet gill artist స్టిల్స్ 3

టాలీవుడ్ లో  పలువురు దర్శకులను కలిశారు. నటనలో, ఫైట్స్ లో శిక్షణ పొంది చక్కని రూపంతో, నిర్మాతలు బడ్జెట్ కి అందుబాటులో ఉండటంతో పలువురు దర్శక నిర్మాతలు ప్రీత్ గిల్ కి తమ సినిమాలలో మంచి పాత్ర ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు.

preet gill artist స్టిల్స్ 5

ఈ సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే కొన్ని సినిమాల్లో ప్రీత్ గిల్ చక్కని పాత్రలు చేయబోతున్నారు. తెలుగు సినిమా రంగంలోని దర్శక నిర్మాతలు అందరికీ.. తనకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా ప్రీత్ గిల్ విజ్ఞప్తి చేస్తున్నాడు.

preet gill artist స్టిల్స్ 6

ఇచ్చిన పాత్రకు తన నటనతో పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాడు ప్రీత్ షేర్ గిల్. అతనికి తెలుగు సినిమా పరిశ్రమ నుండి చక్కని ప్రోత్సాహం లభిస్తుందని ఆశిద్దాం..

బెస్ట్ ఆఫ్ లక్ ప్రీత్ గిల్…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *