మన తెలుగు సినీ పరిశ్రమలో మంచి బేస్ వాయిస్ ఉన్న హీరోలు ఎవరు అంటే వెంటనే గుర్తికి వచ్చేది ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ అని ఎవరిని అడిగిన చెప్తారు. ఆ అప్పుడు ఎప్పుడో మా మెగా పవర్ స్టార్ కి ఏంటివోడు వాయిస్ ఇచ్చాడు కదా అది ఇప్పడు మీరు ఏమిటి చెప్పేది అని మద్యలో వెళ్లిపోకండి. పూర్తిగా చదవండి.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే అది ఓ లెక్కలో వుంటుంది అని సినిమా ఇండిస్ట్రీ మొత్తానికి తెలుసు. రాజ మౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ ఇంటర్డక్సన్ గ్లిమ్స్ లో విన్నాము. ఆ టైమ్ నుండి మన ఏంటీవోడి వాయిస్ ఉన్న సినిమా లు పెద్ద హిట్ అవుతాయి అని సినీ నిర్మాతల సెంటిమెంట్.
అందుకే ఇప్పడు సుకుమార్ కూడా తన కలం నుండి వచ్చిన కధ ను ఎన్టీఆర్ తో వాయిస్ తో సినీ లోకానికి పరిచయం చేయించడానికి ఎంచుకున్నారు ఆట. సుక్కూ స్కెచ్ మామూలుగా లేదుగా ! ఇంతకీ ఈ ఉపోత్గతం అవి అసలు విశయం లో వెళ్తే.. సుక్కూ తన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లో, భోగవల్లి ప్రసాద్గారి తో కలిపినిర్మిస్తున్న సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ రికార్డు చేశారు.

ఈ సుక్కూ సినిమా లో మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ జానర్ లో వుంటుంది అన్నది సోషల్ మీడియా మాట. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో వుంది అంటూ మరో మీడియా హౌస్ కధనం వడ్డించింది.
తేజు బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత చేస్తున్న సినిమా ఇది. అందుకే అటు మెగా ఫ్యామిలీ లోను, ఇటు నిర్మాతలకు కూడా మంచి హిట్ అవ్వాలని గట్టి నమ్మకం తో ఉన్నారు. జనరల్ గా హర్రర్ థ్రిల్లర్ జానర్ లో కధ ఎలా ఉన్న జనాలు చూస్తారు, ఇక్కడ సుకుమార్ నుండి, తేజ్ నుండి వస్తున్న తొలి సినిమా కాబట్టి, మా అందరిలో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అని ఉంది.

ఈ సినిమా కి సుక్కూ శిస్య బృందం లో ఉన్న దండు కార్తీక వర్మ దర్శకుడు గా పరిచయం అవుతున్నాడు. ఈ కార్తీక్ వర్మ కూడా సుక్కూ లనే సినిమా ని బాగా చెక్కే పనిలో ఉన్నట్టు సమాచారం.
బీమ్ బిసార లో నటించి, భీమ్లానాయక్ తో అందరినీ ఆకట్టుకున్న మలయాళ భామ సంయుక్త మీనన్ తెజూ తో కలిసి సినిమా కథానాయిక గా నటిస్తూ మనలనుభయపెట్ట బోతుంది ఆట.
ఇప్పటికి దాదాపు 70శాతం పూర్తి చేసుకొన్న ఈ సినిమా కి సంబందించిన టిజర్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ మా ప్రతినిది తో చెప్పింది.
మాకున్న సమాచారం ఏంటంటే డిసెంబర్ 7 వ తేదీన ఈ సినిమా టిజర్ లేదా గ్లిమ్స్ ని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో విడుదల చేస్తున్నట్టు తెలిసింది.